https://oktelugu.com/

Bumrah Vs Kohli: విరాట్ కనిపిస్తే.. బుమ్రాలో కసి పెరుగుతుంది.. ఈ వైరం ఈనాటిది కాదు..

ప్రస్తుత ఐపీఎల్ లోనూ విరాట్ కోహ్లీ ని బుమ్రా భయపెట్టాడు. బెంగళూరు తరఫున అద్భుతంగా ఆడుతున్న అతనిని.. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై తరఫున బుమ్రా సింగిల్ డిజిట్ కే పరిమితం చేశాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 12, 2024 / 01:06 PM IST

    Bumrah Vs Kohli

    Follow us on

    Bumrah Vs Kohli: సచిన్ టెండూల్కర్ మెక్ గ్రాత్, షోయబ్ అక్తర్, వీరేంద్ర సెహ్వాగ్ బ్రెట్ లీ, యువరాజ్ సింగ్ అండ్రూ ఫ్లింటాఫ్.. దిగ్గజ ఆటగాళ్ల మధ్య పోరాటం ఉండేది. వీరి మధ్య బ్యాటింగ్ , బౌలింగ్ రసవత్తరంగా సాగేది. అలాగని వీరి మధ్య శత్రుత్వం ఉండేది కాదు. మైదానంలో ఉంటే మాత్రం శత్రువుల్లాగానే ఆడేవారు. కానీ ఇప్పటి కాలంలో అలాంటి పోటాపోటీ ఆట విరాట్ కోహ్లీ, బుమ్రా మధ్య సాగుతోంది. అదేంటి విరాట్ ఇండియన్ క్రికెటర్ కదా.. బుమ్రా భారత పేసు గుర్రం కదా.. అనే డౌట్ మీకు రావచ్చు. కానీ వారిద్దరి మధ్య మైదానంలో పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందట. అలాగని వారిద్దరి మధ్య విభేదాలు లేవు.. కానీ ఆటతీరు అలా ఉంటుందని తోటి ఆటగాళ్లు చెబుతుంటారు.

    ఇక ప్రస్తుత ఐపీఎల్ లోనూ విరాట్ కోహ్లీ ని బుమ్రా భయపెట్టాడు. బెంగళూరు తరఫున అద్భుతంగా ఆడుతున్న అతనిని.. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై తరఫున బుమ్రా సింగిల్ డిజిట్ కే పరిమితం చేశాడు. ఈ మ్యాచ్లో 9 బాల్స్ ఎదుర్కొన్న విరాట్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా టాస్ గెలవడం ద్వారా ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపించాడు. దీంతో బెంగళూరు బ్యాటింగ్ మొదలుపెట్టింది. అయితే ఆదిలోనే హంసపాదు లాగా బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ అవుట్ రూపంలో షాక్ తగిలింది. ఓపెనర్ గా బరిలోకి వచ్చిన విరాట్ కోహ్లీ 9 బంతులు ఎదుర్కొన్నాడు. మూడు పరుగులు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్లో ఔట్ అయ్యాడు. వాస్తవానికి బుమ్రా బౌలింగ్లో విరాట్ అవుట్ కావడం ఇది మొదటిసారి కాదు.. గతంలో నాలుగు సార్లు బుమ్రా చేతిలో విరాట్ అవుట్ అయ్యాడు. గురువారం నాటి మ్యాచ్ ద్వారా విరాట్ ను అవుట్ చేసి.. ఐదుసార్లు టీమిండియా రన్ మిషన్ ను వెనక్కి పంపిన ఘనతను బుమ్రా దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీకి పీడ కలను మిగిల్చాడు.

    ఈ మ్యాచ్లో మూడో ఓవర్లో బుమ్రా బౌలింగ్ వేసాడు. విరాట్ కోహ్లీని ఔట్ చేశాడు. బుమ్రా వేసిన బంతిని కొట్టేందుకు విరాట్ తీవ్రంగా ప్రయత్నించాడు..కానీ, బంతి అతడి బ్యాట్ లోపల అంచుకు తగిలి కీపర్ ఇషాన్ కిషన్ చేతిలో పడింది. వాస్తవానికి విరాట్ కోహ్లీ, బుమ్రా మధ్య వైరం ఈనాటిది కాదు. 2013లో ఐపిఎల్ లోకి బుమ్రా ఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచ్ లోనే విరాట్ కోహ్లీ రూపంలో తొలి వికెట్ దక్కించుకున్నాడు. అప్పటినుంచి బుమ్రా వెనుతిరిగి చూసుకోలేదు. విరాట్, బుమ్రా ఐపీఎల్లో చాలాసార్లు తలపడ్డారు. అయితే ఇందులో ఒకరిపై ఒకరు పై చేయి సాధించుకుంటూ వస్తున్నారు..బుమ్రా విరాట్ ను ఐదుసార్లు అవుట్ చేయగా..బుమ్రా బౌలింగ్లో విరాట్ 95 బంతుల్లో 140 రన్స్ చేశాడు. 147.36 స్ట్రైక్ రేట్ కొనసాగిస్తున్నాడు.. గురువారం నాటి మ్యాచ్ లో
    బుమ్రా కోహ్లీని అవుట్ చేయకుండా ఉండి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.