https://oktelugu.com/

Ind Vs Aus 5th Test: స్కానింగ్ లో ఏం తేలింది? బుమ్రా రేపటి మ్యాచ్లో ఆడతాడా? టీమిండియా మేనేజ్మెంట్ క్లారిటీ

భారత కెప్టెన్ జస్ ప్రీత్ బుమ్రా గాయంపై సందిగ్ధం ఇంకా వీడడం లేదు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో ఉన్నట్టుండి బు మ్రా మైదానం నుంచి వెళ్ళిపోయాడు.. ఆ సమయంలో టీమిండియా వైద్య సిబ్బందితో కలిసి అతడు స్కానింగ్ సెంటర్ కి వెళ్ళినట్టు తెలుస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 4, 2025 / 06:59 PM IST

    Ind Vs Aus 5th Test(12)

    Follow us on

    Ind Vs Aus 5th Test: టీమిండియాకు ఎంతో కీలకమైన సిడ్నీ టెస్టులో బుమ్రా రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు.. అయితే అతడికి స్కానింగ్ లో గాయం గురించి తేలితే మాత్రం టీమిండియాకు అది అత్యంత చెడు వార్త. అందువల్లే అభిమానులు అక్కడికి ఎటువంటి గాయం కాకుండా ఉండాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు..” భగవంతుడా బుమ్రా కు ఏమీ కాకూడదు. ప్రస్తుతం టీమిండియా ఉన్న పరిస్థితుల్లో అతడు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలి. కచ్చితంగా టీం ఇండియాను గెలిపించాలి. ఈ కష్టకాలంలో టీమిండియా కు ఉన్న ఏకైక బలం అతడే. ఆ బలాన్ని నిర్వీర్యం చేయొద్దు. అతడికి కొండంత శక్తిని ప్రసాదించు. మూడోరోజు ఆడేలాగా కనికరించని” కోరుకుంటున్నారు. అభిమానులు కోరుకుంటున్నట్టుగా అతడు గనుక మూడో రోజు ఆడితే కచ్చితంగా జట్టుకు అది సానుకూల అంశంగా ఉంటుంది. సిరీస్ విన్నర్ ను డిసైడ్ చేసే మ్యాచ్ లో బుమ్రా ఆడకపోతే జట్టుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పటికే తొలి న్యూస్ లో టీమిండియా 185 పరుగులు మాత్రమే చేయగలిగింది.. మరోవైపు బుమ్రా గాయం కారణంగా మైదానాన్ని వీడి వెళ్లిపోవడంతో.. స్టాండింగ్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వ్యవహరించాడు.

    స్కానింగ్ లో ఏం తేలిందంటే

    జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం బుమ్రా కు నిర్వహించిన స్కానింగ్ లో అతడికి వెన్నునొప్పి ఉందని తేలింది. అయితే స్కానింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత బుమ్రా వేగంగా పరిగెత్తుతూ మెట్లు ఎక్కాడు. డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లిపోయాడు. ఈ ప్రకారం చూసుకుంటే అతడు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడని.. స్వల్ప స్థాయిలో వెన్ను నొప్పి మాత్రమే ఉందని.. మందులు వాడితే తగ్గిపోతుందని.. ఆదివారం జరిగే టీమిండియా రెండవ ఇన్నింగ్స్ లో అతడు బ్యాటింగ్ చేస్తాడని తెలుస్తోంది. జట్టు ఫిజియోథెరపిస్టులు ఎప్పటికప్పుడు అతడిని పర్యవేక్షిస్తున్నారని.. కచ్చితంగా అతడు పూర్వపు స్థాయిలోనే ఆట తీరు ప్రదర్శిస్తాడని స్పోర్ట్స్ వర్గాలు చెబుతున్నాయి.. అయితే బుమ్రా మైదానంలో లేకపోయినప్పటికీ.. విరాట్ కోహ్లీ సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపించాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించాడు. ప్రసిద్ కృష్ణ, సిరాజ్ వంటి వారితో అటాకింగ్ చేయించి ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించాడు. ఫలితంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 181 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. ఇక రెండవ ఇన్నింగ్స్ లో టీమిండియా 6 వికెట్లు నష్టపోయి 141 రన్స్ చేసింది. ప్రస్తుతం రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా పై భారత్ 145 పరుగుల లీడ్ లో ఉంది.