India Vs Australia: అడిలైడ్ టెస్టులో సెంచరీ చేసి టీమిండియా కు విజయాన్ని దూరం చేశాడు. ఏకంగా పది వికెట్ల తేడాతో ఓడిపోయేలా చేశాడు. మహమ్మద్ సిరాజ్, బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి.. ఇలా ఎవరినీ వదిలిపెట్టలేదు. దూకుడే మంత్రంగా.. బాదుడే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు. టెస్టులలో వన్డే తరహా లో ఆడి అదరగొట్టాడు. ఫలితంగా టీమ్ ఇండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోవలసి వచ్చింది. ఇక బ్రిస్బేన్ టెస్టులోనూ హెడ్ అదే తరహా బ్యాటింగ్ చేశాడు. తోటి ఆటగాళ్లు విఫలమైనప్పటికీ.. అతడు మాత్రం మైదానంలోనే పాతుకుపోయాడు. కేవలం బ్యాటింగ్ చేయడానికి పుట్టినట్టు.. బౌండరీలు కొట్టడానికే బ్యాట్ చేత పట్టినట్టు.. ఆడాడు. మైదానంలో ఉన్నంతసేపు తాండవం చేశాడు. దీంతో టీం ఇండియా బౌలర్లు చేతులెత్తేశారు. చివరికి భారత బౌలర్లు హెడ్ వికెట్ తీసినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అది అంతిమంగా టీమ్ ఇండియాకు తీవ్ర నష్టం చేకూర్చింది. అతి కష్టం మీద టీమిండియా ఆ మ్యాచ్ ను డ్రా చేసుకోవాల్సి వచ్చింది. లేకుంటే హెడ్ వల్ల టీమిండియా రెండవ ఓటమిని మూట కట్టుకోవాల్సి వచ్చేది. ఇక మూడవ టెస్ట్ ముగిసిన తర్వాత హెడ్ గాయపడ్డాడని వార్తలు వచ్చాయి. నాలుగో టెస్ట్ కు అతడు అందుబాటులో ఉండడని ఆస్ట్రేలియా మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అయితే చివరికి హెడ్ ఆడతాడని ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ ప్రకటించడంతో.. టీం ఇండియాలో మళ్ళీ ఒత్తిడి మొదలైంది. హెడ్ తన బ్యాటింగ్ స్టైల్ తో భారత బౌలర్లకు నిద్రలేని రాత్రులను పరిచయం చేస్తున్నాడు మరి. గిల్ క్రిస్ట్, హెడెన్ లాగా ఆడుతూ టీమ్ ఇండియా బౌలర్లకు నరకం చూపిస్తున్నాడు.
బుమ్రా పడగొట్టాడు
టీమిండియాకు శిరోభారంగా మారిన హెడ్ ను బుమ్రా వెనక్కి పంపించాడు. 0 పరుగులకే పెవిలియన్ దారి చూపించాడు.. లబూ షేన్ అవుట్ అయిన తర్వాత హెడ్ క్రీజ్ లోకి వచ్చాడు. అయితే ఈసారి కూడా సెంచరీ చేస్తాడని ఆస్ట్రేలియా అభిమానులు అనుకున్నారు. అయితే గాయం వల్లనో, మరో కారణం వల్లనో తెలియదు గాని.. ఈసారి హెడ్ ఊహించిన విధంగా సౌకర్యవంతంగా కనిపించలేదు. క్రీజ్ లో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డాడు. ఏడు బంతులు ఎదుర్కొన్న అతడు.. బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్ద్ అయ్యాడు. ఎడమ చేతి వాటం బ్యాటింగ్ చేసే హెడ్.. బుమ్రా వేసిన షార్ట్ పిచ్ బంతిని అంచనా వేయలేకపోయాడు. అది ప్యాడ్, బ్యాట్ సందులో నుంచి వెళ్లి వికెట్ ను పడగొట్టింది.. దీంతో నిరాశతో మైదానాన్ని వీడడం హెడ్ వంతఅయింది. హెడ్ అవుట్ కావడంతో టీం ఇండియా ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా బ్యాటర్లు కొన్ స్టాస్, ఖవాజా, లబూ షేన్, స్మిత్ (62*) హాఫ్ సెంచరీలు చేశారు. ఆస్ట్రేలియాను భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు 5 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు.
Add this to the list of Bumrah’s unplayable bangers this year:
Root, Pope, Stokes, Smith, and…
Today, Head!#INDvsAUS | #BGT2024 pic.twitter.com/p0egvn2R7M
— House_of_Cricket (@Houseof_Cricket) December 26, 2024