https://oktelugu.com/

Anand Mahindra : ఆనంద్ మహీంద్రా భార్య, పిల్లల గురించి ఆసక్తికర విషయాలు? ఎందుకు వారి గురించి ఆయన గోప్యంగా ఉంచారు?

ఆనంద్ మహీంద్రా దేశంలోని ప్రసిద్ధ పారిశ్రామికవేత్త అనే విషయం తెలిసిందే. అయితే ఈయనకు కూడా ఓ సెలబ్రెటీకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 26, 2024 / 12:35 PM IST

    Anand Mahindra

    Follow us on

    Anand Mahindra : ఆనంద్ మహీంద్రా దేశంలోని ప్రసిద్ధ పారిశ్రామికవేత్త అనే విషయం తెలిసిందే. అయితే ఈయనకు కూడా ఓ సెలబ్రెటీకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ ఎంతో మంది నెటిజన్లతో టచ్ లో ఉంటారు. ఏదైనా కొత్తగా కనిపిస్తే చాలు వారితో కాంట్రాక్ట్ లోకి వస్తారు. కొత్త ఇన్నోవేషన్ ఐడియాతో ఉన్నవారికి ఉద్యోగం ఇవ్వడానికి కూడా ముందుకు వస్తారు ఆనంద్ మహీంద్రా. ఎప్పటికప్పుడు సృజనాత్మక వీడియోలను పంచుకోవడం ఆయనకు అలవాటు. ఇక ఈయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎంతో మందికి కొత్త విషయాలను కూడా తెలియజేస్తారు. కానీ, తన కుటుంబ సమాచారాన్ని మాత్రం ఎప్పుడు గోప్యంగానే ఉంచుతారు. ఆనంద్ మహీంద్రా ఎవరిని పెళ్లి చేసుకున్నాడో మీలో ఎవరికి అయినా తెలుసా? మరి ఆయనకు ఎంత మంది పిల్లలో తెలుసా? అయితే ఆ వివరాలు ఇప్పుడు మీకోసం.

    ఆనంద్ మహీంద్రా కు మీరు కూడా ఫ్యానా? అయితే ఈయన జర్నలిస్ట్ అనురాధ మహీంద్రాను వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరు కూడా చదువుకునే సమయంలో ఒకరికొకరు దగ్గరయ్యారు. అంటే స్నేహం ఆ తర్వాత ప్రేమ తర్వాత వారిద్దరూ వివాహం వంటివి సంభవించాయి. ఆనంద్ మహీంద్రా భార్య లైఫ్ స్టైల్ మ్యాగజైన్ మ్యాన్స్ వరల్డ్ అనే ప్రసిద్ధ మ్యాగజైన్ వ్యవస్థాపకురాలు అని మీలో ఎంత మందికి తెలుసు. ఈమె కూడా చాలా టాలెంటెడ్.

    ఇక ఆనంద్ మహీంద్రా పిల్లల విషయానికి వస్తే ఆయనకు దివ్య, అలిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దివ్య మహీంద్రా 2009లో న్యూయార్క్‌లో చదువుకున్నారు. ఇక్కడ ఈమె ‘ది న్యూ స్కూల్’ నుంచి డిజైన్, విజువల్ కమ్యూనికేషన్‌లో పట్టా పొందారు. 2016 లో ఆమె వెర్వ్ మ్యాగజైన్‌కు ఆర్ట్ డైరెక్టర్‌గా మారడం ఆశ్చర్యం. అంతకుముందు ఆమె ఫ్రీలాన్స్‌గా పనిచేసింది. ఇలా చేస్తూనే తన వృత్తిని ప్రారంభించింది. దివ్య న్యూయార్క్‌కు చెందిన ఆర్కిటెక్ట్ జార్జ్ జపాటాను వివాహం చేసుకొన్నారు.

    ఆనంద్ మహీంద్రా చిన్న కూతురు అలికా మహీంద్రాకు కూడా వివాహం జరిగింది. ఈమె ఫ్రెంచ్ పౌరసత్వం ఉన్న వ్యక్తిని వివాహం చేసుకుందని టాక్. అలికా ప్రస్తుతం న్యూయార్క్‌లో నివసిస్తున్నారు అని సమాచారం. కుటుంబ వ్యాపారంలో చురుకుగా పాల్గొనలేదట ఈ కూతురు. ఇద్దరు సోదరీమణులు ప్రజల దృష్టికి, వివాదాలకు, ప్రముఖులకు చాలా దూరంగా ఉంచి పెంచారు ఆనంద్ మహీంద్ర. ఇక ఈయన మే 1, 1955న జన్మించారు. 2012లో మహీంద్రా గ్రూప్‌కు ఛైర్మన్‌గా మారారు. మహీంద్రా గ్రూప్ అనేది ఆటోమోటివ్, ఏరోస్పేస్, అగ్రిబిజినెస్, ఐటితో సహా విభిన్న రంగాలలో పనిచేస్తున్న ఒక సమ్మేళనం అని తెలిసిందే. ఆనంద్ మహీంద్రా సంస్థ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన జగదీష్ చంద్ర మహీంద్రా మనవడు అని మీలో ఎంత మందికి తెలుసు. అయితే ఎందుకో కానీ ఇలా ఫ్యామిలీకి సంబంధించినా చాలా విషయాలను ఆయన గోప్యంగానే ఉంచారు.