https://oktelugu.com/

Jason Gillespie: పాక్ ను కూరలో కరివేపాకు లాగా తీసిపడేసిన ఆసీస్.. భారత్ తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మాత్రమే ముఖ్యమట!

క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. అయితే దానికి ఆ స్థాయిని కొన్ని జట్లు మాత్రమే తీసుకు రాగలవు. అలాంటి వాటిలో భారత్ ముందు వరుసలో ఉంటుంది. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా భారత్ ఆడే క్రికెట్ మ్యాచ్లను ప్రేక్షకులు చూస్తుంటారు. ఆరాధిస్తుంటారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 12, 2024 / 08:35 AM IST

    Jason Gillespie

    Follow us on

    Jason Gillespie: క్రికెట్లో సంచలనాలకు ఆస్ట్రేలియా కారణం కావచ్చు గాని… క్రికెట్ కు జెంటిల్మెన్ హోదా తీసుకొచ్చిన ఘనత మాత్రం ముమ్మాటికి భారత జట్టుది అనడంలో సందేహం లేదు. ఆస్ట్రేలియా స్లెడ్జింగ్ చేస్తుంది. ఇంగ్లాండ్ బూతులు మాట్లాడుతుంది. వెస్టిండీస్ బంతులతో గాయాలు చేస్తుంది. పాకిస్తాన్ లో ఆటగాళ్ల ప్రాణాలకే భరోసా లేకుండా పోతుంది. కానీ ఇండియాలో అలా కాదు. క్రికెట్ ఒక మతం అయితే ఇక్కడ మెజారిటీ ప్రజలు దానినే ఆచరిస్తుంటారు. అందుకే క్రికెట్ భారత్ చుట్టూ తిరుగుతోంది. భారత్ లో మాత్రమే. అందువల్లే మిగతా జట్లు భారత్ లో ఆడాలని భావిస్తుంటాయి. భారత్ తో పోటీ పడాలని అనుకుంటాయి. చివరికి పాకిస్తాన్ కూడా..

    పరువు పోయింది

    ప్రస్తుతం పాకిస్తాన్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. వన్డే సిరీస్ గెలిచింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ దక్కించుకుంది. అయితే ఈ సిరీస్ కు ఆస్ట్రేలియా పెద్దగా ప్రచారం కల్పించడం లేదని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని పాకిస్తాన్ తాత్కాలిక శిక్షకుడు గిలెస్పీ పేర్కొన్నా. గిలెస్పి ఆస్ట్రేలియా జట్టులో ఒకప్పుడు ఆడాడు. ఆ జట్టు విజయాలలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు అతడు తన మాతృదేశంపై ఆరోపణలు చేయడం విశేషం. ఇదే సమయంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా మీడియా విపరీతమైన కవరేజ్ ఇస్తోందని అతడు మండిపడ్డాడు..” ఇది చిత్రంగా అనిపిస్తోంది. ఆశ్చర్యంగానూ వినిపిస్తోంది. పాకిస్తాన్ జట్టుతో జరుగుతున్న సిరీస్ కు ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ ప్రచారం కల్పించడం లేదు. ఆస్ట్రేలియన్ మీడియా కూడా ప్రధానంగా ప్రస్తావించడం లేదు. కానీ త్వరలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు మేనేజ్మెంట్ విపరీతమైన ప్రచారం చేస్తోంది. ఆస్ట్రేలియా మీడియా కూడా గొప్ప పాత్రను పోషిస్తోందని” గిలెస్పీ వ్యాఖ్యానించాడు.

    పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియా పై వన్డే సిరీస్ గెలిచిన విషయాన్ని.. ఆ దేశ మీడియా పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. పాకిస్తాన్ జట్టులో జరుగుతున్న సిరీస్ కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని సమాచారం. గిలెస్పి వ్యాఖ్యలు కూడా దానినే సూచిస్తున్నాయి. ఇక ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ గెలిచిన నేపథ్యంలో.. పాకిస్తాన్ జట్టు తదుపరి అంకానికి సిద్ధమవుతోంది. త్వరలో ఆస్ట్రేలియా జట్టుతో పాకిస్తాన్ టి20 సిరీస్ ఆడనుంది. నవంబర్ 14 నుంచి పాకిస్తాన్ – ఆస్ట్రేలియా మధ్యలో మూడు టి20 మ్యాచ్లో సిరీస్ ప్రారంభమవుతుంది. అయితే నవంబర్ 22 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలవుతుంది. ఆస్ట్రేలియా వేదికగా ఈ సిరీస్ జరుగుతుంది. రెండు దేశాల మధ్య 5 టెస్ట్ మ్యాచ్లు జరుగుతాయి. భారత జట్టు నుంచి తొలి బృందం గత ఆదివారం ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. రెండవ బృందం సోమవారం వెళ్ళింది. ఇక మంగళవారం నుంచి భారత జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ లో పాల్గొంటారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ ట్రోఫీ నేపథ్యంలో భారత జట్టుకు ఈ సిరీస్ చాలా ముఖ్యం. డబ్ల్యూటీసీలో ఫైనల్ వెళ్లాలంటే భారత్ ఆస్ట్రేలియా పై 4-0 తేడాతో గెలుపొందాల్సి ఉంది.