https://oktelugu.com/

Anil Ravipudi : నాకు ఉన్న తుత్తర కారణంగా ఆ స్టార్ హీరోతో సినిమా మిస్ అయ్యింది అంటూ అనీల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్!

అయితే ఇప్పటికీ మునిగిపోయింది ఏమి లేదు, ఎన్టీఆర్ అన్న ఒప్పుకుంటే ఎప్పుడైనా ఆయనతో సినిమా చేసేస్తా. పాన్ ఇండియా రేంజ్ కి తగ్గట్టే నా దగ్గర ఒక స్టోరీ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు అనీల్ రావిపూడి

Written By:
  • NARESH
  • , Updated On : January 26, 2025 / 09:34 PM IST
    Anil Ravipudi

    Anil Ravipudi

    Follow us on

    Anil Ravipudi : టాలీవుడ్ లో మాత్రమే కాదు, సౌత్ లోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో అనీల్ రావిపూడి పేరు టాప్ 5 లో ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. శ్రీనువైట్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలుపెట్టిన ఆయన, పటాస్ సినిమాతో డైరెక్టర్ గా మారి, ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం వరకు ఆయన కెరీర్ జైత్ర యాత్రగా సాగింది. ఇక నుండి కూడా అలాగే సాగుతుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. హీరోలతో సంబంధం లేకుండా, ఆయన ఎవరితో తీసిన ఆడియన్స్ ని తన సినిమాకి క్యూలు కట్టించుకునే రేంజ్ కి ఎదిగిపోయాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా అవకాశం ఎలా మిస్ అయ్యిందో చెప్పుకున్నాడు.

    ‘పటాస్’ చిత్రం కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన వెంటనే అనీల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయాలనీ అనుకున్నాడు. అందులో భాగంగా వెంటనే ఆయనకీ కలిసి స్టోరీ చెప్పగా, కథ బాగుంది కానీ, ఇప్పుడే కాదు, కాస్త సమయం తీసుకొని ఈ చిత్రాన్ని చేద్దాం అన్నాడట ఎన్టీఆర్. ఈలోపు దిల్ రాజు రవితేజ సినిమా ఒకటి ఓకే అయ్యింది, నీ దగ్గర ఉన్నటువంటి ‘రాజా ది గ్రేట్’ సబ్జెక్టు తీసుకొని రా, రేపు హీరో దగ్గరకి వెళ్దాం అని చెప్పాడు. వెంటనే ఒప్పేసుకొని రవితేజ గారికి ఆ స్టోరీ ని వినిపించాను. ఆయనకు తెగ నచ్చేసింది, వెంటనే చేద్దాం అన్నారు, అలా చిత్రం మొదలైపోయింది అనీల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. అలా తొందరగా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లకపోయి ఉండుంటే, కచ్చితంగా ఎన్టీఆర్ తో సినిమా చేసేవాడిని ఏమో, నా తుత్తర కారణంగా ఈ కాంబినేషన్ మిస్ అయ్యింది అంటూ చెప్పుకొచ్చాడు అనీల్.

    అయితే ఇప్పటికీ మునిగిపోయింది ఏమి లేదు, ఎన్టీఆర్ అన్న ఒప్పుకుంటే ఎప్పుడైనా ఆయనతో సినిమా చేసేస్తా. పాన్ ఇండియా రేంజ్ కి తగ్గట్టే నా దగ్గర ఒక స్టోరీ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు అనీల్ రావిపూడి. ఇదంతా పక్కన పెడితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ బంపర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న అనీల్ రావిపూడి, తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి తో చేయబోతున్నట్టు ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో రెండు వారాల్లో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ని అధికారికంగా చెప్పబోతున్నారు మేకర్స్. ఈ చిత్రం మెగాస్టార్ అభిమానులు చిరకాలం గుర్తించుకునే రేంజ్ లో ఉండబోతుందట. ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి లో ఎవ్వరూ చూడని కోణాన్ని అనీల్ రావిపూడి చూపించబోతున్నట్టు తెలుస్తుంది.