https://oktelugu.com/

James Anderson: 2వ టెస్ట్ లో అరుదైన సంఘటన..ఆ బౌలర్ మొదటి మ్యాచ్ ఆడినప్పుడు వీళ్ళు ఇంకా పుట్టలేదు…

ఇక ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఆయన 184 వ టెస్టు మ్యాచ్ ను ఆడుతున్నాడు. కాబట్టి ఇప్పటివరకు ఈ ఘనతను సాధించిన ఏకైక ఇంగ్లాండ్ ప్లేయర్ గా కూడా ఆయన ఒక రికార్డుని సృష్టించాడు.

Written By:
  • Gopi
  • , Updated On : February 2, 2024 / 02:46 PM IST
    Follow us on

    James Anderson: ప్రస్తుతం ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఇవాళ్ళ స్టార్ట్ అయిన ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకుంది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇండియన్ ప్లేయర్లు ముందుకు వెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 లో జేమ్స్ అండర్సన్ మరోసారి చోటు సంపాదించుకున్నాడు.ఇక ఇప్పటికే ఈయన 700 వికెట్ల మైలురాయికి దగ్గరగా ఉండటం వల్ల ఆ ఫీట్ ని అందుకోవడానికి టెస్ట్ మ్యాచ్ లను ఆడుతున్నాడు అంటూ మరికొంతమంది ఆయన మీద కామెంట్లు అయితే చేస్తున్నారు.

    ఇక ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఆయన 184 వ టెస్టు మ్యాచ్ ను ఆడుతున్నాడు. కాబట్టి ఇప్పటివరకు ఈ ఘనతను సాధించిన ఏకైక ఇంగ్లాండ్ ప్లేయర్ గా కూడా ఆయన ఒక రికార్డుని సృష్టించాడు. ఇప్పటివరకు 22 సంవత్సరాలుగా ఇంగ్లాండ్ టీమ్ కి తనదైన సేవలు అందిస్తూ వస్తున్న అండర్సన్ ప్రస్తుతం 41 సంవత్సరాల వయసున్నప్పటికీ యంగ్ ప్లేయర్లకు సైతం పోటీని ఇస్తూ బౌలింగ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆడుతున్న ఈ మ్యాచ్ లో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అది ఏంటి అంటే ఇంగ్లాండ్ టీమ్ లో ఉన్న ఇద్దరు ప్లేయర్లు జేమ్స్ అండర్సన్ ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ కి ఎంట్రీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంకా పుట్టలేదు.

    ఇది వినడానికి కొంచెం నమ్మశక్యంగా లేనప్పటికీ, నమ్మక తప్పదు. అండర్సన్ మే 22, 2003 వ సంవత్సరంలో తన మొదటి టెస్ట్ మ్యాచ్ ని ఆడాడు. షోయబ్ బషీర్ అక్టోబర్ 13, 2003 జన్నించగా, రెహన్ అహ్మద్ ఆగస్టు 13, 2004వ సంవత్సరంలో జన్మించాడు. ఇక వీళ్లిద్దరూ తోపాటు ఇప్పుడూ అండర్సన్ అదే టీమ్ లో అడుతుండటం నిజంగా విశేషం అనే చెప్పాలి. ఇక ఇది చూస్తుంటే తన టీమ్ ను గెలిపించడానికి అప్పటినుంచి ఇప్పటివరకు అండర్సన్ ఒకే పోరాట పటిమతో ఆడుతున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం 42 సంవత్సరాల వయసు ఉన్న అండర్సన్ ఇంగ్లాండ్ టీమ్ లో ది బెస్ట్ బౌలర్ గా కూడా కొనసాగుతున్నాడు అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి… ఇక ఇప్పటివరకు అండర్సన్ మొత్తం 184 మ్యాచులు ఆడగా అందులో 690 వికెట్లు తీశాడు…