Poonam Kaur: ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ లకు ఏదో ఒక రకమైన వ్యాధి వస్తుంటుంది. ఈ మధ్య చర్మ సంబంధ వ్యాధులు లేదా మానసికంగా ఇతరత్రా వ్యాధుల బారిన పడిన నటీనటులు గురించి వింటున్నాం. గత కొంత కాలంగా సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఈ వ్యాధి ఒకటి ఉంటుందని కూడా చాలా మందికి తెలియదు. కానీ సమంత ఈ వ్యాధితో బాధపడుతుందని తెలిసి ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం ఈ అమ్మడు ఆ వ్యాధి నుంచి కోలుకుంటుందట.
ఇక ప్రస్తుతం పూనమ్ కౌర్ కూడా అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. ఈమె గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సినిమాలలో ఈమె హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి తనదైన ముద్ర వేసుకుంది. అయితే ఈమె సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకుంది. అయితే తెలుగులో మాత్రమే కాదు తమిళం, హిందీ ఇండస్ట్రీలలో కూడా తనదైన ముద్ర వేసుకుంది.
ఎన్నో సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించిన పూనమ్ కౌర్ ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. ఈమె సినిమాలకు సంబంధించి ఎక్కువగా కాంట్రవర్సీలు అవుతుంటాయి. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి స్పందిస్తుంటుంది. ఇలా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈమె ప్రస్తుతం అనారోగ్యపాలైందని తెలుస్తోంది. గతంలోనే తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు తెలిపింది. ఫైబ్రోమయాల్జియా అనే సమస్యతో బాధ పడుతుందట పూనమ్.
ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధి కూడా ఒక రకమైన మయోసైటిస్ వ్యాధి లాంటిదేనట. ఇది తీవ్రమైన నొప్పిని, శరీరాన్ని నిస్సత్తువుగా మారుస్తుందట. అలసట, నిద్రలేమి ఎక్కువగా ఉంటుందట. దీని వల్ల పూనమ్ కూడా చాలా రోజులు బాధపడ్డాను అని వెల్లడించింది. కాళ్లు పట్టేసేవని, టైట్ గా ఉండే దుస్తులు ధరించలేకపోయేదాన్ని అని.. తెలిపింది. దాదాపు రెండు సంవత్సరాల పాటు టైట్ దుస్తువులను ధరించలేదట. ఇక మంతెన సత్యనారాయణను కలిసి ఆయన సలహాల మేరకు నయం అయిందని తెలిపింది.