https://oktelugu.com/

Kia Micro SUV : కియా నుంచి మైక్రో SUV.. ఫీచర్స్ అదిరిపోయాయి..

కియా నుంచి రిలీజ్ అయిన సోనెట్ అత్యధికంగా విక్రయాలు జరుపుకుంటున్నప్పటికీ వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త మోడల్ ను పరిచయం చేయనుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : February 2, 2024 2:47 pm
    kia micro Suv

    kia micro Suv

    Follow us on

    Kia Micro SUV : దక్షిణ కొరియాకు చెందిన కియా కార్ల కంపెనీ దేశంలో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి ఎన్నో మోడళ్లు మార్కెట్లోకి వచ్చి ఆకట్టుకున్నాయి. ఇప్పటి వరకు హ్యుందాయ్ భాగస్వామ్యంతో పలు కార్లను పరిచయం చేసిన కియా.. ఇప్పుడు సొంతంగా మైక్రో ఎస్ యూవీ విభాగంలోకి అడుపెట్టింది. కియా నుంచి రిలీజ్ అయిన సోనెట్ అత్యధికంగా విక్రయాలు జరుపుకుంటున్నప్పటికీ వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త మోడల్ ను పరిచయం చేయనుంది. అదే మైక్రో SUV సోనెట్. ప్రస్తుతం మార్కెట్లో హ్యుందాయ్ ఎక్సెటర్, టాటా పంచ్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న ఈ మోడల్ గురించి తెలుసుకుందామా..

    కియా కంపెనీ కొత్తగా తీసుకొస్తున్న మైక్రో ఎస్ యూవీకి ‘కియా క్లావిస్’ అని పేరు పెట్టింది. ఈ మోడల్ 1.2 లీటర్ నేచురల్ 4 సిలిండర్ తో పాటు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇందులో ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పాటు మాన్యువల్ గేర్ బాక్స్ సౌకర్యం ఉండొచ్చు. కియా క్లావిస్ బాక్సీ డిజైన్ ను కలిగి ఉంటుందని అంటున్నారు. ఇందులో డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంపులు అమరుస్తారు.

    కియా క్లావిస్ ఫీచర్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. ఇందులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్ లెస్ ఫోన్ కనెక్టివిటీ, ఏసీ వెంట్ తో పాటు ఫోన్ చార్జింగ్ సాకెట్ ఉన్నాయి. ఇందులో అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ అలరిస్తుంది. ఇందులో 360 డిగ్రీ కెమెరా, 12 పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. ప్రయాణికుల భద్రత కోసం మూడు సీటు బెల్ట్ లను అమరుస్తున్నారు.

    టాటా , హ్యుందాయ్ కంపెనీలు మైక్రో ఎస్ యూవీలను పరిచయం చేసి విజయవంతం అయ్యాయి. అందువల్ల ఇప్పుడు కియా మైక్రో ఎస్ యూవీని పరిచయం చేయాలనుకుంటోంది. ఇప్పటికే కియా నుంచి రిలీజ్ అయిన సోనెట్ తో అమ్మకాల్లో దూసుకుపోతున్న ఈ కంపెనీ నుంచి త్వరలో రిలీజ్ కాబోతున్న కియా క్లావిస్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.