Rohit Sharma – Virat Kohli : ఇదేం చెత్త ఆట.. స్పిన్ ఆడలేరా? రోహిత్, విరాట్ మీరిక టెస్టుల నుంచి కూడా రిటైర్ అయితే మంచిది

పూణే వేదికగా న్యూజిలాండ్ జట్టుతో భారత్ టెస్ట్ ఆడుతోంది. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తోంది. ఆ సమయంలో ప్లకార్డులు పట్టుకొని అభిమానులు అటు ఇటు తిరుగుతున్నారు. వారు రోహిత్ ను ఆకాశానికి ఎత్తేస్తూనో, విరాట్ ను పొగుడుతూనో ఆ పని చేయలేదు. వారి ఫ్ల కార్డులపై ఉన్న పేరు పూజార.. దాని మీద వారు రాసింది.. పూజారను మళ్ళీ జట్టులోకి తీసుకురమ్మని..

Written By: Anabothula Bhaskar, Updated On : October 26, 2024 5:42 pm

Rohit Sharma - Virat Kohli

Follow us on

Rohit Sharma – Virat Kohli :  ఈ చిన్న సంఘటన చాలు అభిమానుల్లో విరాట్ – రోహిత్ పై ఏ స్థాయిలో కోపం ఉందో చెప్పడానికి.. న్యూజిలాండ్ కెప్టెన్ లాతం పూణే టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 16 పరుగులు చేశాడు. కానీ రెండవ ఇన్నింగ్స్ లో ఏకంగా 86 పరుగులు చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 255 పరుగులు చేసిందంటే దానికి ప్రధాన కారణం లాతం బ్యాటింగ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అదే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ విషయానికి వస్తే ఇందుకు పూర్తి విరుద్ధం. తొలి ఇన్నింగ్స్ లో అతడు డక్ అవుట్ అయ్యాడు. రెండవ ఇన్నింగ్స్ లో 8 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. ఇక విరాట్ గురించి చెప్పాల్సి వస్తే తొలి ఇన్నింగ్స్ లో 9 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఇక రెండవ ఇన్నింగ్స్ లో 17 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో చెత్త షాట్ ఆడి సాంట్నర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయిన విరాట్.. రెండవ ఇన్నింగ్స్ లోనూ సాంట్నర్ బౌలింగ్ లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. వాస్తవానికి రోహిత్, విరాట్ కు న్యూజిలాండ్ జట్టుమీద తిరుగులేని రికార్డు ఉంది. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఆడారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కుదురుకోవాల్సింది పోయి.. నిర్లక్ష్యంగా వికెట్లను పారేసుకున్నారు. ఫలితంగా టీమిండియా ఓడిపోవాల్సి వచ్చింది. వీరిద్దరిట్లో ఎవరైనా ఒకరు కుదురుకుంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. అలా కాకుండా తమ సీనియార్టీని పక్కనపెట్టి నిర్లక్ష్యంగా ఆడటం వల్ల జట్టు విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేశారు. పూణే టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో విరాట్ సాంట్నర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ సమయంలో మైదానంలో కామెంట్రీ చెప్తున్న సంజయ్ మంజ్రేకర్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు..”విరాట్ తన కెరియర్లో ఆడిన అత్యంత చెత్త షాట్ ఇదేనని” వ్యాఖ్యానించాడంటే.. విరాట్ ఆటతీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వీడ్కోలు పలకండి

విరాట్, రోహిత్ దారుణంగా ఆడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల ఇండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాత రోహిత్, విరాట్ పొట్టి ఫార్మాట్ కు శుభం కార్డు వేశారు. ప్రస్తుతం రోహిత్ వయసు 37 సంవత్సరాలు, విరాట్ వయసు 35 దాటింది. ఒకప్పటిలాగా వీరిద్దరూ చురుకుగా ఆడటం లేదు. ఫీల్డింగ్ కూడా అదే స్థాయిలో చేయడం లేదు. అందువల్ల వీరిద్దరూ టెస్ట్ క్రికెట్ కు కూడా వీడ్కోలు పలకాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు. టీమిండియా నవంబర్ 1 నుంచి ముంబై వేదికగా న్యూజిలాండ్ జట్టుతో చివరి టెస్ట్ ఆడుతుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా తో టి20 సిరీస్ ఆడుతుంది. అనంతరం నవంబర్ నెలలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లి పోతుంది. టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ నెగ్గాలి అంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అత్యంత ముఖ్యం. గత రెండు సీజన్లో టీమిండియా ఆస్ట్రేలియాపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచింది. ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలంటే జట్టులో సమూల మార్పులు జరగాలి. అది రోహిత్, విరాట్ నుంచే ప్రారంభం కావాలని అభిమానులు ఆగ్రహంగా వ్యాఖ్యానిస్తున్నారు.