Nani Vs Dhanush Vs Dulquer Salmaan: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు ఒక్క సక్సెస్ ను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటారు….కానీ కొంతమంది హీరోలు మాత్రం వరుస విజయాలను సాధిస్తున్నారు… ఇక్కడ సక్సెస్ ఉన్నవాళ్లకు మాత్రమే మంచి గుర్తింపు ఉంటుంది. మిగతా వారిని ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఎలాగైనా సరే సినిమాలను సూపర్ సక్సెస్ గా నిలపాలంటే మాత్రం చాలామంది చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది…ఇక కొంతమంది యంగ్ హీరోలు మాత్రం మంచి సినిమాను చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నారు. వాళ్ళు ఎవరనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడు నాని…ప్రస్తుతం ఈయన వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఆయన ఒక స్క్రిప్ట్ ను ఫైనల్ చేశాడు అంటే ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుందని చాలామంది భావిస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే నాని లాంటి హీరో ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…
ఇక మలయాళం ఇండస్ట్రీలో దుల్కర్ సల్మాన్ సైతం స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. క్యారెక్టర్ తో సంబంధం లేకుండా జానర్ ను అస్సలు పట్టించుకోకుండా కంటెంట్ బాగుంటే చాలు ఆ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ గా మారుస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలన్ని మంచి విజయాన్ని సాధించినవే కావడం విశేషం…
ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ అటెంప్ట్ లతో ప్రేక్షకులను మెప్పించగలిగే కెపాసిటీ ఉన్న నటుడు ధనుష్… ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఒక ప్రయోగాత్మకమైన సినిమా అనే చెప్పాలి. రొటీన్ కమర్షియల్ సినిమాలకు తను విరుద్ధంగా ఉంటాడు. డిఫరెంట్ సినిమాలు చేసినప్పుడే ప్రేక్షకులు తనను ఆదరిస్తారనే ఒక ఉద్దేశ్యంతో ఉంటాడు. కాబట్టి ప్రతిసారి ఒక డిఫరెంట్ సినిసు చేసి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తుంటాడు…
తెలుగు, తమిళ్, మలయాళం మూడు భాషల నుంచి ఈ ముగ్గురు హీరోలు మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే వీళ్ళ ముగ్గురికి భాషలతో సంబంధం లేకుండా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. అయితే వీరిలో ఎవరు బెస్ట్ హీరో అనేదాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు నాని ఎంచుకుంటున్న సినిమాలు బాగుంటాయి అని చెబుతుంటే, మరి కొంత మంది మాత్రం ధనుష్ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంటుందని చెబుతున్నారు.
ఇక దుల్కర్ సల్మాన్ జానర్ షిఫ్టింగ్ బాగుంటుందని అతను ఏ సినిమా చేసిన అందులో ఒదిగిపోయి నటిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన నటన కూడా అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికైతే ఈ ముగ్గురు హీరోలు సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…