Islamabad Blast: ఏ క్షణం ఎక్కడ బాంబు పేలుతుందో తెలియదు. ఎవరు ఎవరి మీద దాడులు చేస్తారో అంతకంటే తెలియదు. అక్కడ పోలీసులు ఉంటారు కానీ పెద్దగా పట్టించుకోరు. ఆర్మీ ఉంటుంది గానీ ప్రజలకు రక్షణ కల్పించదు. అక్కడ నిత్యం ఏదో ఒకచోట ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వం చూస్తూ ఉంటుంది. చనిపోయిన తర్వాత శవాలను ఖననం చేయడానికి అంబులెన్స్ పంపిస్తుంది.
సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం పాకిస్థాన్లో పర్యటించడానికి శ్రీలంక వెళ్ళింది. అప్పుడు ఉగ్రవాదులు వికృత క్రీడకు పాల్పడ్డారు. కాల్పులకు తెగబడ్డారు. దీంతో శ్రీలంక ప్లేయర్లు ప్రాణాలు పరిస్థితుల్లో పెట్టుకొని స్వదేశానికి వెళ్ళిపోయారు. అప్పటినుంచి కొన్ని సంవత్సరాల వరకు శ్రీలంకలో ఏ జట్టు కూడా పర్యటించలేదు. ఆ తర్వాత కొంతకాలానికి పరిస్థితి కాస్త కుదుట పడిన నేపథ్యంలో ఇతర దేశాలు పాకిస్తాన్లో పర్యటిస్తున్నాయి. భారత్ ఎప్పటి మాదిరిగానే పాకిస్తాన్ తో ఆడటం లేదు.
ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటంలేదు. కేవలం ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలలో మాత్రమే తలపడుతోంది. అది కూడా తటస్థ వేదికల్లో మాత్రమే ఆడుతోంది.. ఇక ఇటీవల ఆసియా కప్ ఆడినప్పుడు పాకిస్తాన్ ఏ విధంగా స్పందించింది.. దానికి భారత్ ఏవిధంగా బదులిచ్చింది.. అందరికీ తెలిసిందే. ఆసియా కప్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ ప్రస్తుతం స్వదేశంలో శ్రీలంక జట్టుతో వన్డే సిరీస్ ఆడుతోంది. ఈసిరీస్లో భాగంగా శ్రీలంక జట్టు పాకిస్తాన్ కు వెళ్ళిపోయింది.. రెండు జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. అయితే రెండో వన్డేలో ఆడేందుకు ప్రయత్నిస్తుండగా రావల్పిండి ప్రాంతంలో భారీ బాంబు పేలుడు చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన ఈ ఘటనలో 12 మంది చనిపోయారు. 27 మంది గాయపడ్డారు. ఈ ఘటన పాకిస్తాన్లో తీవ్ర కలకలం సృష్టించింది.. ఈ ఘటన రెండవ వన్డేకు ముందు చోటు చేసుకోవడంతో శ్రీలంక జట్టు నుంచి ఎన్ని మంది ప్లేయర్లు గురువారం స్వదేశానికి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు వర్గాలు కూడా ధ్రువీకరించాయి. రావల్పిండి స్టేడియం ఇస్లామాబాద్ ప్రాంతానికి అత్యంత దగ్గరలో ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల భద్రతపై ఆందోళన నెలకొంది. స్వదేశానికి వెళ్తున్న ఆటగాళ్లు.. త్వరలో జరిగే ట్రై సిరీస్ లో ఆడబోరని తెలుస్తోంది. దీంతో గురువారం జరగాల్సిన రెండో వన్డే పై నీలి నీడలు కమ్ముకున్నాయి. స్వదేశానికి వెళ్లిన ఆటగాళ్ల స్థానంలో ప్రత్యామ్నాయ ప్లేయర్లను ఆడించడానికి శ్రీలంక బోర్డు సిద్ధమవుతోంది. ఒక మొదటి వన్డేలో పాకిస్తాన్ ఆరు పరుగుల తేడాతో శ్రీలంక మీద విజయం సాధించింది.