MI Vs LSG 2024
MI Vs LSG 2024: ఐదుసార్లు ఐపీఎల్ విజేత.. బలమైన బ్యాటింగ్.. అంతకంటే మెరుగైన బౌలింగ్ లైనప్ తో ఉన్న ముంబై జట్టు..ఈ ఐపీఎల్ లో తేలిపోయింది. వరుసగా మ్యాచ్లలో ఓడిపోయి..లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ క్రమంలో ముంబై జట్టు ఆటగాళ్లపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కనీస పోరాట పటిమ మర్చిపోయారని నెటిజన్ల ఆరోపణలు ఎదురయ్యాయి. అయితే ఇలాంటి వాటికి ఆటతీరుతో సమాధానం చెప్పాల్సిన ముంబై ఆటగాళ్లు.. ఆ విమర్శలకు బలం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారు. మైదానంలో ప్రాక్టీస్ కు బదులు కొట్లాటకు దిగుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ముంబై జట్టులో ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్ కు స్టార్ బ్యాటర్లుగా పేరుంది. అయితే వీరు మైదానంలో ఆటను ప్రాక్టీస్ చేయాల్సింది పోయి.. ఒకరినొకరు కొట్టుకున్నారు. మిగతా ఆటగాళ్లు చూస్తుండగానే కొట్లాడుకున్నారు.. ముంబై జట్టు ఐపిఎల్ సీజన్లో చివరి మ్యాచ్ ఆడుతోంది. లక్నో జట్టుతో వాంఖడే వేదిక ఈ మ్యాచ్ జరగనుంది. ఇందుకు సంబంధించి ఇరు జట్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. ఈ క్రమంలో మైదానంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది..
ముంబై జట్టుకు వికెట్ కీపర్ గా వ్యవహరిస్తున్న కిషన్.. ఆ జట్టు మరో కీలక ఆటగాడు టిమ్ డేవిడ్ మైదానంలో అందరూ చూస్తుండగానే కొట్టుకున్నారు. కొంతసేపు ఇద్దరు కుస్తీ పట్టారు. వారు పోట్లాడుకున్న తీరు చూస్తే నిజంగా కొట్టుకుంటున్నారేమోననే భ్రమ కల్పించారు. వాస్తవంగా ఆ వీడియో చూస్తే అది నిజమే అనిపించేలా ఉంది.. అయితే ఈ వీడియోను ముంబై ఇండియన్స్ జట్టు తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేసింది. “ఇది సాధారణ రెజ్లింగ్ అని, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంటివద్ద ప్రయత్నించకండి” అంటూ హెచ్చరిక క్యాప్షన్ కూడా పెట్టింది. అయితే ఈ వీడియోలో టిమ్ డేవిడ్ ను చాలాసార్లు కింద పడేయాలని కిషన్ ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది. తన బ్యాటింగ్, కీపింగ్ ఎలా ఉన్నప్పటికీ..ఇషాన్ కిషన్ మైదానంలో తోటి ఆటగాళ్లతో సరదాగా ఉంటాడు. ఆ విషయాన్ని మరోసారి నిరూపించాడు.
#Watch: Mumbai Indians shared this video of Ishan Kishan & Tim David indulging a casual wrestling with captioning “Warning: These are trained professionals, don’t try this at home “#MumbaiIndians #IshanKishan #TimDavid #IPL #Wrestling #LokmatTimes pic.twitter.com/S4iUuK3Xjl
— Lokmat Times (@lokmattimeseng) May 16, 2024