Elephants: పెద్ద ఏనుగులన్నీ రౌండప్ చేశాయి.. గున్న ఏనుగుకు జెడ్ సెక్యూరిటీ వీడియో చూడాల్సిందే

సదరు ఐఏఎస్ అధికారిణి ఆ దృశ్యం ఎక్కడిదో వివరించే ప్రయత్నం చేశారు. చక్కటి క్యాప్షన్ జత చేశారు.'తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో అందమైన ఏనుగు కుటుంబం ఎంతో హాయిగా నిద్రిస్తోంది. చూడండి గున్న ఏనుగుకు ఆ కుటుంబం ఏ విధంగా జెడ్ క్యాటగిరి భద్రతను కల్పిస్తోంది.

Written By: Dharma, Updated On : May 17, 2024 4:16 pm

Elephants

Follow us on

Elephants: సాధారణంగా అడవిలో కొన్ని జంతువులకు రక్షణ ఉండదు. ఇటువంటి సమయంలోనే జంతువులు ఐక్యతను కనబరుస్తాయి. క్రూర మృగాల బారి నుంచి తప్పించుకుంటాయి. ఇటువంటి దృశ్యాలు మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం. అటువంటి దృశ్యమే తాజాగా ఒకటి కనిపించింది. ఐఏఎస్ అధికారిణి సుప్రియ సాహూ తన ఎక్స్ వేదికగా ఓ వీడియోను జత చేస్తూ పోస్ట్ చేశారు. అందులో నిద్రపోతున్న ఓ గున్న ఏనుగును క్రూర మృగాల బారి నుంచి కాపాడేందుకు మిగతా ఏనుగులు చేసిన ఓ ప్రయత్నం ఆకట్టుకుంది. ఆ గున్న ఏనుగు చుట్టూ మిగతా పెద్ద ఏనుగులన్నీ రక్షణ వలయంగా ఏర్పడి కాపాడుతున్న తీరు వైరల్ అవుతోంది.

సదరు ఐఏఎస్ అధికారిణి ఆ దృశ్యం ఎక్కడిదో వివరించే ప్రయత్నం చేశారు. చక్కటి క్యాప్షన్ జత చేశారు.’తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో అందమైన ఏనుగు కుటుంబం ఎంతో హాయిగా నిద్రిస్తోంది. చూడండి గున్న ఏనుగుకు ఆ కుటుంబం ఏ విధంగా జెడ్ క్యాటగిరి భద్రతను కల్పిస్తోంది.. అలాగే ఓ పెద్ద ఏనుగు కుటుంబ సభ్యుల భద్రతను గమనిస్తూ.. ఎలా లేచి చుట్టుపక్కల పరిస్థితిని గమనిస్తుందో… అచ్చం మన కుటుంబంలోనే ఉంది కదూ’ అంటూ ఆమె క్యాప్షన్ జోడించారు. అయితే ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా ఐఏఎస్ అధికారిణి సుప్రియ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అద్భుత దృశ్యాన్ని చిత్రీకరించారు. అటవీ బృందానికి ధన్యవాదాలు అంటూ ఎక్కువమంది అభినందిస్తున్నారు. 15 సెకండ్ల నిడివి కలిగిన ఈ వీడియో ఇలా నెటిజనులను ఆకట్టుకుంటోంది. కుటుంబమే మహాబలం. ఈరోజు నేను చూసిన అద్భుత వీడియో చిరకాలం గుర్తుండి పోతుంది. అందుకు మీరే కారణం అంటూ ఐఏఎస్ అధికారిణి సుప్రియ కు సోషల్ మీడియాలో అభినందనలు పెరుగుతున్నాయి.