Ishan Kishan: బాధ్యత లేకుండా.. చెప్పినట్టు వినకుండా.. వ్యవహరించిన ఆటగాడిని మేనేజ్మెంట్ దూరం పెట్టింది.. ఏ హే పో.. అంటూ ఛీ కొట్టి పంపింది. చివరికి ఇప్పుడేమో స్వాగతం పలుకుతోంది. దాదాపు 662 రోజుల లాంగ్ గ్యాప్ తర్వాత.. అతడికి టీమ్ ఇండియా లో అవకాశం లభించింది. అలాంటి అవకాశం దక్కించుకున్న ఆటగాడి పేరు ఇషాన్ కిషన్.. వాస్తవానికి ఎంతో విద్వత్తు ఉన్న ఈ ఆటగాడు.. ఇలా అవకాశాల కోసం లాంగ్ గ్యాప్ ఎదుర్కోవడానికి ప్రధాన కారణం అతని నిర్లక్ష్య పూరితమైన వ్యవహార శైలి. సహజంగానే బీసీసీఐలో నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయి. అందువల్లే ఇషాన్ కిషన్ కు ద్వారాలు ముగుసుకుపోయాయి. చివరికి ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత తెరుచుకున్నాయి. దీంతో అతని పొలంలో మొలకలు వచ్చాయని సోషల్ మీడియాలో అభిమానులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: ఐపీఎల్ లీగ్ స్టేజ్ ముగిసినట్టే.. ప్లే ఆఫ్ చేరుకున్న టీమ్ లు ఇవే..
వచ్చే నెల నుంచి ఇంగ్లీష్ దేశంతో భారత్ ఐదు టెస్టులు ఆడుతుంది. దీనికంటే ముందు ఇంగ్లాండ్ టూర్ కు ఇండియా ఏ జట్టు వెళ్తుంది. ఇందులో 18 మంది ప్లేయర్లకు అవకాశం కల్పిస్తూ ఇటీవల సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్లేయర్ల లిస్టు కూడా బయటికి విడుదల చేశారు. అయితే ఇందులో ఎవరు ఊహించని విధంగా ఇషాన్ కిషన్ పేరు కనిపించింది. కిషన్ 662 రోజుల గ్యాప్ తర్వాత ఎరుపు రంగు బంతి ఫార్మాట్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్న ఇతడు.. త్వరలోనే ఇంగ్లాండ్ వెళతాడు. ఎందుకంటే ఐపీఎల్లో హైదరాబాద్ గ్రూప్ దశ నుంచే ఎగ్జిట్ అయింది.
కిషన్ తన లాస్ట్ టెస్ట్ 2023లో ఆడాడు. అప్పట్లో వెస్టిండీస్ టూర్ సందర్భంగా కిషన్ భారత జట్టు తరుపున ఆడాడు. జూలై 20, 24 మధ్య పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన మ్యాచ్లో కిషన్ ఆడాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా టూర్ కు అతడు ఎంపికైనప్పటికీ తన పేరును విత్ డ్రా చేసుకున్నాడు. కిషన్ చేసిన పనికి ద్రావిడ్ ఒక రకంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. మేనేజ్మెంట్ కూడా అదే స్థాయిలో కోపాన్ని ప్రదర్శించింది.. సౌత్ ఆఫ్రికా టూర్ లో తన పేరు విత్ డ్రా చేసుకున్న కిషన్ ను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి రిమూవ్ చేశారు. ఇక ఆ తర్వాత కిషన్ 2024 ఐపీఎల్ సీజన్ ఆడాడు. ముంబై జట్టు తరఫున పర్వాలేదు అనిపించాడు. అయితే మెగా వేలంలో అతడిని ముంబై జట్టు అంటి పెట్టుకోలేదు. ఇక ఇప్పుడు గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాడు. అతని ఆధ్వర్యంలో కిషన్ కు అవకాశం లభించింది. ఇక కిషన్ ఇప్పటివరకు రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడితే..78 రన్స్ చేశాడు. ఒకవేళ ఇండియా – ఏ జట్టుతో కనుక అతడు ప్రతిభ చూపితే.. జాతీయ జట్టులో అవకాశాలు లభించవచ్చు. రెడ్ బాల్ ఫార్మాట్లో అతడు కనుక మెరుగైన ప్రతిభ చూపిస్తే.. జాతీయ జట్టులో తన స్థానాన్ని అతడు సుస్థిరం చేసుకోవచ్చు. రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత జట్టులో ప్లేస్ లభించడంతో కిషన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. నీ పొలంలో మొలకలు వచ్చాయని కిషన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు.