Ishan Kishan- Virat Kohli: ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకను వారి సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. దీంతో టీమిండియా ఎనిమిదోసారి ఆసియా కప్ ఛాంపియన్ గా నిలిచింది.
మ్యాచ్ తర్వాత ఫన్నీ ఘటన..
ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ అనంతరం ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. అవార్డు ఫక్షన్ సందర్భంగా టీమిండియా ప్లేయర్స్ ఒక చోట నిలబడ్డారు. ఈ క్రమంలో అక్కడున్న టీమ్‌ఇండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ విరాట్ కోహ్లీ వాక్ ఎలా చేస్తాడో ఇమిటేట్ చేశాడు. భారత బౌలర్ ప్రత్యర్థి వికెట్ తీసినప్పుడు కోహ్లీ యాక్షన్ ఎలా ఉంటుందో చూపించాడు. తనను మిమిటేట్ చేసిన ఇషాన్ కిషన్‌ను కోహ్లీ ఇమిటేట్ చేశాడు. ఇషాన్ ఎలా నడుస్తాడో చేసి చూపించాడు. ఇది చూసి స్టేడియం అంతా నవ్వుకున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీ అభిమానులు కూడా ఆ వీడియోను ఇష్టపడుతూ కామెంట్లు చేస్తున్నారు.
గతంలోనూ టీజ్ చేసిన ఇషాన్..
వెస్టిండీస్ పర్యటన సందర్భంగా కూడా ఇషాన్, విరాట్ మధ్య ఫన్నీ సన్నివేశం జరిగింది. తొలి టెస్ట్‌లో కీపింగ్ చేసిన ఇషాన్ కిషన్.. పక్కనే స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీని టీజ్ చేశాడు. అశ్విన్ బౌలింగ్ వేస్తున్న సమయంలో ఇది జరిగింది. బంతి వేసిన తర్వాత ఇషాన్ కిషన్ కోహ్లిని ఉద్దేశించి.. ‘విరాట్ భాయ్ తొడాసా సీదా కోనాసిజ్ దుండల్ లీ భాయ్’ అని పేర్కొన్నాడు. ఇషాన్ కిషన్ వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి ట్విటర్‌లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది.
బంగ్లాదేశ్ మ్యాచ్‌లో వాటర్ మ్యాన్‌గా..
ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ మ్యాచ్‌లో టీమిండియా జట్టు సీనియర్లకు విశ్రాంతి ఇచ్చింది. విరాట్‌తోపాటు సిరాజ్, బూమ్రా, కుల్దీప్, రాహుల్ విశ్రాంతి తీసుకున్నారు. అయితే కోహ్లీ విశ్రాంతి తీసుకోలేదు. ఆ మ్యాచ్‌లో వాటర్ మ్యాన్‌గా పనిచేశాడు. ఆటగాళ్లకు నీళ్లు అందిస్తూ మైదానంలో సందడి చేశాడు. ఆయన ఫన్నీ రన్నింగ్ నవ్వులు తెప్పించింది.