అయితే ఈ వ్యాఖ్యల పట్ల సామాజిక మాధ్యమాలు వేదికగా భారత అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎప్పుడో రిటైర్డ్ అయిన అక్తర్ గురించి కాకుండా ప్రస్తుతం ఉన్న గొప్ప బౌలర్ల గురించి చెప్పుకోవాలంటూ చురకలంటిస్తున్నారు.
Written By:
BS , Updated On : June 25, 2023 / 10:28 AM IST
Follow us on
Team India : క్రికెట్ ను అమితంగా ఆరాధించే అభిమానులు ఆసియా ఖండంలోనే ఎక్కువగా ఉన్నారు. గెలుపోటములను కూడా సమంగా తీసుకోలేని పిచ్చి అభిమానం ఈ దేశాల్లోనే క్రికెట్ అభిమానులకు ఉంది. అందుకే ఆసియా ఖండంలోని దేశాల మధ్య మ్యాచ్ జరిగితే లక్షలాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తమ జట్టే గెలుస్తుందంటూ సవాళ్లు విసురుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్పుకు రంగం సిద్ధమవుతోంది. ఈసారి ఆసియా కప్ పాకిస్తాన్ లో జరగనుంది. అయితే, భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ మాత్రం శ్రీలంకలో జరగనుంది. ఆసియా కప్ ప్రారంభం కాకముందే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. భారత్ ను రెచ్చగొట్టే విధంగా ఆ దేశ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ ఓపెనర్ అహ్మద్ షహజాద్ చేసిన వ్యాఖ్యలు ఇదే కోవలోకి వస్తాయని పలువురు పేర్కొంటున్నారు.
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే చాలు.. హై వోల్టేజ్ లో జరుగుతుంది. అభిమానులు కూడా అందుకు తగ్గట్టుగానే అంచనాలతో సిద్ధమవుతారు. ప్రజల ఆటగాళ్లు సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడిని మరింత పెంచుతుంటారు. ఈసారి ఆసియా కప్ లో ఇది జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే మాటల తూటాలు పేలుతున్నాయి. ఈసారి పాకిస్తాన్ ఓపెనర్ అహ్మద్ షహజాద్ మాటల దాడిని ప్రారంభించాడు. ప్రస్తుతం అతడు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ప్రత్యర్థులను భయపెట్టే బౌలర్ లేడన్న షహజాద్..
ఆసియా కప్ నేపథ్యంలో పాకిస్తాన్ ఓపెనర్ అహ్మద్ షహజాద్ ఓ మీడియా సంస్థ తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు అంటే తనకు గౌరవం అని చెప్పిన అహ్మద్.. వారిని అవమానించడం తన ఉద్దేశం కాదంటూనే కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత బౌలింగ్ విభాగంలో ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టే ఒక్క బౌలర్ కూడా లేడని ఈ సందర్భంగా
షహజాద్ స్పష్టం చేశాడు. బుమ్రా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లు మంచి బౌలర్లేనని, అయితే వాళ్లు అంత ప్రమాదకరమైన బౌలర్లు కాదని స్పష్టం చేశాడు. పాకిస్తాన్ జట్టులో సోయబ్ అక్తర్ లాంటి బౌలర్ ఉండేవాడిని, అతడిని చూస్తే బ్యాటర్లు భయపడే వాళ్ళని వెల్లడించాడు. జట్టులోకి వచ్చిన కొత్తలో అక్తర్ బౌలింగ్లో తాను చుక్కలు చూసానని ఈ సందర్భంగా షహజాద్ వివరించాడు. అత్తరు బౌలింగ్ ఫేస్ చేసేందుకు ఇంటర్నేషనల్ బ్యాటర్లు మాత్రమే కాదు.. నెట్స్ లో సొంత జట్టు సభ్యులు కూడా భయపడే వాళ్ళని షహజాద్ వ్యాఖ్యానించాడు. భారత జట్టులో అటువంటి బౌలర్ లేడని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల సామాజిక మాధ్యమాలు వేదికగా భారత అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎప్పుడో రిటైర్డ్ అయిన అక్తర్ గురించి కాకుండా ప్రస్తుతం ఉన్న గొప్ప బౌలర్ల గురించి చెప్పుకోవాలంటూ చురకలంటిస్తున్నారు.