India vs Pakistan T20 World Cup 2022: ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు. మ్యాచ్ ఉందంటే చాలు ఇంట్లోనే ఉండి టీవీలకు అతుక్కుపోయే అభిమానులున్న దేశం. అందుకే క్రికెట్ కు అంతటి ప్రాధాన్యం ఇస్తుంటారు. మనం అభిమానించినంత ఏ దేశస్తులు కూడా పాటించరు. అందులో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇక ఆ మజాయే వేరు. బంతి బంతికి ఎంతో ఆతృత వ్యక్తం చేస్తుంటారు. ఇక సిక్సులు, ఫోర్లు కొడితే చప్పట్లే చప్పట్లు. అంతటి విలువ ఉన్న క్రికెట్ కు మనం అంతగా ఆకర్షితులం అవుతాం. దీంతో టీ20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న క్రమంలో దాయాది దేశాల పోరుపై అందరిలో ఉత్సాహం పెరుగుతోంది.

మెల్ బోర్న్ వేదికగా అక్టోబర్ 23న ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. కానీ దీనికి వరుణుడు అడ్డు తగలనున్నాడు. ఆ రోజు ఎనభైశాతం వర్షం పడుతుందని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ పై అనుమానాలున్నాయి. ఇప్పటికే పాక్ క్రీడాకారులు మన ఆటగాళ్లపై కవ్వింపు మాటలతో రెచ్చగొడుతున్న క్రమంలో మ్యాచ్ రద్దయ్యే సూచనలు ఉండటంతో అభిమానుల కోరిక నెరవేరుతుందా? ఆట జరుగుతుందా? వరుణుడు కరుణిస్తాడా? అనే సంశయాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.
మ్యాచ్ కు రెండు రోజుల ముందే భారీ వర్షం పడుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్, పాక్ మ్యాచ్ జరిగి అభిమానుల కోరిక తీరుతుందా? లేక వరుణుడి దెబ్బకు కుదేలవుతుందా? అని ఎదురు చూస్తున్నారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అందులో ఉండే మజా కోసమే అందరు ఆతృత వ్యక్తం చేస్తుంటారు. ఇప్పటికే క్రీడాకారులు ఆస్ట్రేలియా చేరుకున్నారు. మ్యాచ్ ల కోసం కసరత్తులు చేస్తున్నారు. విజయం కోసం వ్యూహాలకు పదును పెడుతున్నారు.

క్రీడాభిమానులు భారత్, పాక్ మ్యాచ్ రద్దు అవుతుందని తెలియడంతో నిరాశ చెందుతున్నారు. దీంతో దాయాది దేశాల పోరు లేకపోవడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. మ్యాచ్ నిర్వహణపై వరుణుడు దెబ్బ తీయనుండటంతో అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లినట్లు అయింది. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ పై వర్షం విలన్ గా మారనుందని చెబుతున్నారు. మరి మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. వరల్డ్ కప్ లో విజయం సాధించి కప్ గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.