Ram Charan- NTR: రాజమౌళి తెరకెక్కించిన మూవీ ‘ఆర్ఆర్ఆర్’ పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీని ఆడియన్స్ ఆదరించడంతో పాటు కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. ఇందులో మల్టీ సూపర్ స్టార్లు నటించడంతో అటు ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ ను జపాన్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ వేశాడు జక్కన్న. ఇందులో భాగంగా అక్కడ ప్రమోషన్ నిర్వహించేందుకు రాజమౌళితోపాటు చెర్రీ, ఎన్టీఆర్ లు వెళ్లారు. వారు ప్రమోషన్ నిర్వహించే కొన్ని పిక్స్ సోషల్ మీడియాలోకి వచ్చాయి. ఇందులో చెర్రీ, తారక్ లో కిర్రాక్ స్టైల్లో కనిపించి ఆకట్టుకున్నారు.

ఈనెల 21న జపాన్ లో ట్రిపుల్ ఆర్ రిలీజ్ కానుంది. అంతకుముందు దీని గురించి ప్రేక్షకులకు చెప్పాలన్నది రాజమౌళి టీం లక్ష్యం. దీంతో అక్కడ కూడా ప్రమోషన్ చేయాలనుకున్నారు. ఇందులో భాగంగా ఇటీవల స్టార్ హీరోలతో పాటు రాజమౌళి ఒకే వేదికపై కూర్చున్న ఫొటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఈ ముగ్గురు వైట్ కోట్ వేసుకున్నారు. లోపల బ్లాక్ టీషర్ట్ వేశారు. వీటితో పాటు చెర్రీ, తారక్ లు బ్లాక్ స్పెడ్స్ తో కనిపించి ఆకట్టుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ ఇండియాలో రిలీజ్ కు ముందు ఇలాగే ప్రమోషన్ చేశారు. కానీ ఇలాంటి రిచ్ లుక్ లో ఎప్పుడూ కనిపించలేదు. జపాన్ లో అడుగుపెట్టగానే వారి స్టైల్ మారిపోయిందని ఫ్యాన్ష్ అనుకుంటున్నారు.
‘బాహుబలి’ సినిమాతో రాజమౌళి సినిమాలకు జపానీయులు ఫిదా అవుతున్నారు. దీంతో అప్పటి నుంచి రాజమౌళి తన సినిమాలను జపాన్ లో ప్రత్యేకంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ప్రమోషన్ చేసి సినిమా గురించి చెబితే మరింత ఆకట్టుకోవచ్చని జక్కన ప్లాన్. అందుకే స్టార్ హీరోలతో కలిసి జక్కన్న అక్కడికి వెళ్లారు. అక్కడి మీడియా సమావేశంలో వీరున్న ఫొటోలు సోషల్ మీడియాలోకి రావడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో 1200 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు జపాన్ లో కూడా మంచి కలెక్షన్లు వస్తున్నాయని అంటున్నారు. జపాన్ లో సౌత్ ఇండియా సినిమాలను ఎక్కువగా ఆదరిస్తారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే వాళ్లకు పిచ్చి. ఈమధ్యే రాజమౌళి సినిమాలకు వారి మనసు మార్చుకున్నారు. అయితే ట్రిపుల్ ఆర్ సినిమా తరువాత రాజమౌళి రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది.