తనకు ఫిట్ నెస్ లేదని ఆస్ట్రేలియా టూర్ కు దూరంపెట్టడంపై రోహిత్ శర్మ రగిలిపోతున్నట్టు ఉన్నాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరుఫున ఆడుతూ తొడ కండరాల గాయంతో కొన్ని మ్యాచ్ లకు రోహిత్ దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత ఫైనల్ లో ఆడి జట్టును గెలిపించి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాడు. క్రికెట్ లో ఎవరికి లేని రికార్డును సొంతం చేసుకున్నాడు. అయినా కూడా ఆస్ట్రేలియాతో త్వరలో జరిగే క్రికెట్ సిరీస్ కు రోహిత్ దూరం కావడంపై దేశవ్యాప్తంగా అభిమానులు కలత చెందారు. ఏంటి బీసీసీఐ తీరు అని విమర్శలు గుప్పించారు. దీంతో వెంటనే ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కు రోహిత్ ను ఎంపిక చేశారు. అయితే రోహిత్ మాత్రం తనపై పడ్డ అపనిందను (ఫిట్ నెస్ లేమిని) తొలగించుకునే పనిలో పడ్డాడు. అందుకే తాజాగా రోహిత్ శర్మ బెంగళూరులోని జాతీయ క్రికెట్ ఆకాడమీలో చేరి తన ప్రత్యర్థులపై హాట్ కామెంట్స్ చేశారు.
ఆస్ట్రేలియాతో సిరీస్ కు ఎంపిక కాని భారత క్రికెట్ ఓపెనర్ రోహిత్ శర్మ తాజాగా రోహిత్ ను ఎంపిక చేయకపోవడంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా దుమారం రేపింది. తొడ కండరాల గాయంతో రోహిత్ ను బీసీసీఐ సెలెక్టర్లు పక్కనపెట్టారు.కానీ ఇదే రోహిత్ ఇప్పుడు ఫిట్ నెస్ ను నిరూపించుకునేందుకు బీసీసీఐ నేతృత్వంలోని బెంగళూరు జాతీయ అకాడమీలోనే చేరడం.. ఆస్ట్రేలియాకు వెళ్లకుండా ఇండియాకు రావడం సంచలనమైంది. .
Also Read: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా.. ఇద్దరు కీలక బౌలర్లుకు రెస్ట్ ఇచ్చిన బీసీసీఐ.. ఎందుకు?
ఈ క్రమంలోనే తనను పక్కనపెట్టిన పరిణామాలపై కలత చెందిన రోహిత్ శర్మ తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను పక్కనపెట్టడానికి కోహ్లీనే కారణమన్న విమర్శల నేపథ్యంలో పరోక్షంగా వారికి సవాల్ చేసేలా రోహిత్ శర్మ మాట్లాడడం సంచలనమైంది. తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్నానని.. త్వరలోనే పూర్తి ఫిట్ నెస్ సాధిస్తానని రోహిత్ ధీమా వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు ముందు తనలో ఎలాంటి లోపాలు లేవనే విషయాన్ని అందరికీ స్పష్టం చేయాలనే ఉద్దేశంతోనే ఎన్.సీ.ఏలో చేరినట్లు రోహిత్ చెప్పాడు. ఏ విషయంలోనూ తనను వేలెత్తి చూపొద్దనే ఉద్దేశంతోనే పూర్తి ఫిట్ నెస్ కోసం కష్టపడుతున్నానని తెలిపారు. పూర్తి ఫిటెనెస్ సాధించి ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ఆడుతానని తెలిపారు.
‘అసలేం జరుగుతుందనే విజయంపై నాకు స్పష్టత లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా తెలియదు. నేనొక విషయం చెప్పదలుచుకున్నా.. నేను నిరంతరం బీసీసీఐ, ముంబై ఇండియన్స్ తో చర్చలు జరుపుతున్నా.. లీగ్ దశలో గాయపడిన తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టాను. పరుగు చేశాను’ అని రోహిత్ శర్మ ఇండియన్ క్రికెట్ పరిణామాలపై ఒకింత సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీన్ని బట్టి రోహిత్ శర్మ.. తనకు అడ్డుపడుతున్న కోహ్లీ సహా బీసీసీఐ సెలెక్టర్లకు ఒకింత హెచ్చరికలు పంపాడనే తెలుస్తోంది.