https://oktelugu.com/

రవిశాస్త్రి గుడ్ బై.! టీమిండియా కొత్త కోచ్ అతడే?

టీమిండియా ప్రధాన కోచ్ గా ఉన్న రవిశాస్త్రి గుడ్ బై చెప్పనున్నాడా? కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో కనీసం ఒక్క వరల్డ్ కప్ కూడా టీమిండియా గెలవలేదు. వీరిద్దరి కాంబినేషన్ దేశాల టూర్లలో సక్సెస్ అయిన ప్రపంచకప్ లాంటి భారీ ఈవెంట్ల విషయం వచ్చేసరికి టీమిండియా ఓడిపోతూనే ఉంది. పోయిన వన్డే ప్రపంచకప్, టీ20 కప్, తాజాగా ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లోనూ టీమిండియా చివరి అంకంలో ఓడిపోయింది. సిరీస్ విజయాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : August 11, 2021 / 01:50 PM IST
    Follow us on

    టీమిండియా ప్రధాన కోచ్ గా ఉన్న రవిశాస్త్రి గుడ్ బై చెప్పనున్నాడా? కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో కనీసం ఒక్క వరల్డ్ కప్ కూడా టీమిండియా గెలవలేదు. వీరిద్దరి కాంబినేషన్ దేశాల టూర్లలో సక్సెస్ అయిన ప్రపంచకప్ లాంటి భారీ ఈవెంట్ల విషయం వచ్చేసరికి టీమిండియా ఓడిపోతూనే ఉంది.

    పోయిన వన్డే ప్రపంచకప్, టీ20 కప్, తాజాగా ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లోనూ టీమిండియా చివరి అంకంలో ఓడిపోయింది. సిరీస్ విజయాలు తెస్తున్నా కీలకమైన ప్రపంచకప్ లలో మాత్రం టీమిండియా తేలిపోతోంది.

    ఈ క్రమంలోనే వచ్చి టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి వెళ్లిపోవడం ఖాయమేనా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే ప్రపంచకప్ తోనే బీసీసీఐతో అతడు చేసుకున్న కాంట్రాక్ట్ ముగిసిపోతోంది. ఈ పాటికే బీసీసీఐకి కోచ్ రవిశాస్త్రి తన నిర్ణయం చెప్పేసినట్టుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

    భారత క్రికెట్ జట్టు కోచింగ్ బృందంలో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయి. కోచ్ రవిశాస్త్రి హయాంలో టీమిండియా ఒక్క ప్రపంచకప్ కూడా గెలవకపోవడంతో ఇక టీం ఇండియా కోచింగ్ బృందంలో పెనుమార్పులు చేయాలని బీసీసీఐ కూడా డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇక టీం ఇండియా కోచ్ పదవికి గుబ్ బై చెప్పేస్తానని బీసీసీఐకి రవిశాస్త్రి చెప్పినట్టు సమాచారం.

    ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత రవిశాస్త్రి వీడ్కోలు పలుకుతాడట.. ఇప్పటికే రవిశాస్త్రికి 59 ఏళ్లు వచ్చాయని.. కోచ్ పదవికి వయో పరిమితి 60ఏళ్లే.. పైగా సుధీర్ఘకాలంగా కోచ్ గా ఉన్నాడు. దీంతో బీసీసీఐ కూడా ఇప్పుడు టీమిండియా కోచ్ రేసులో భారత యువ ఆటగాళ్లను తీర్చిదిద్దుతున్న అండర్ 19 జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ ను నియమించేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.

    భారత అండర్ 19, భారత్ ఏ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఎంతో విజయవంతం అయ్యాడు. ఎన్సీఏ చీఫ్ గా కూడా రిజర్వ్ బెంచ్ ను పటిష్టంగా తయారు చేశాడు. భారత జట్టులోని అందరితో రాహుల్ ద్రావిడ్ కు మంచి అనుబంధం ఉంది. ఇటీవలే శ్రీలంకలో పర్యటించిన భారత జట్టుకు కోచ్ గా పనిచేశాడు.

    కోచ్ గా రిటైర్ అయ్యాక రవిశాస్త్రి టీవీ వ్యాఖ్యాత, ఐపీఎల్ కోచ్, మెంటర్ గా అప్పుడే బోలెడు అవకాశాలు వస్తున్నాయట.. దీంతో రాహుల్ ద్రావిడ్ నెక్ట్స్ కోచ్ కావడం ఖాయం అని అంటున్నారు.