https://oktelugu.com/

Daku Maharaj movie : డాకు మహారాజ్ ‘దబిడి..దిబిడి’ సాంగ్ పై మండిపడుతున్న ఫ్యాన్స్..శేఖర్ మాస్టర్ ని బ్యాన్ చెయ్యాలంటూ డిమాండ్!

గ్లిమ్స్ వీడియో ని చూసిన వాళ్లకు బాలయ్య ఈసారి సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చాడని అంతా అనుకున్నారు. కానీ నిన్న విడుదలైన 'దబిడి..దిబిడి' ఐటెం సాంగ్ చూసిన తర్వాత ఇది రెగ్యులర్ బాలయ్య మార్క్ మాస్ సినిమానే అని అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా ఈ సాంగ్ లోని స్టెప్స్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైన నెగటివిటీ ఏర్పడింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : January 3, 2025 / 08:45 PM IST

    Daku Maharaj Movie , 'Dabidi Dibidi' song

    Follow us on

    Daku Maharaj movie : ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల అవ్వబోతున్న సినిమాలలో ఒకటి బాలయ్య బాబు హీరో గా నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రం. వరుసగా హ్యాట్రిక్ హిట్స్ తర్వాత ఆయన చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై అంచనాలు భారీ అంచనాలు ఉన్నాయ్. పైగా ఈ చిత్ర దర్శకుడు బాబీ గత చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ తో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటి వరకు విడుదల చేసిన కంటెంట్ కి డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. అయితే గ్లిమ్స్ వీడియో ని చూసిన వాళ్లకు బాలయ్య ఈసారి సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చాడని అంతా అనుకున్నారు. కానీ నిన్న విడుదలైన ‘దబిడి..దిబిడి’ ఐటెం సాంగ్ చూసిన తర్వాత ఇది రెగ్యులర్ బాలయ్య మార్క్ మాస్ సినిమానే అని అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా ఈ సాంగ్ లోని స్టెప్స్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైన నెగటివిటీ ఏర్పడింది.

    ఆ పాటకు కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్ ని నెటిజెన్స్ అడ్డమైన బూతులు తిడుతున్నారు. 65 ఏళ్ళ వయస్సు దాటిన హీరోతో చేయించాల్సిన స్టెప్పులా ఇవి, మాస్ పేరుతో, అడల్ట్ స్టెప్పులకు యూత్ ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారని ఏది పడితే అది చేయిస్తారా అంటూ సోషల్ మీడియా లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ పాటలో బాలయ్య ఊర్వశి రౌతేలా పై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ, చాలా తప్పు అర్థం వచ్చేలా చూపిస్తున్నారని, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యుండి, ఇలాంటివి ప్రోత్సహించడం సరికాదని, పైగా బాలయ్య బాబు ఉంటున్న పార్టీ అధికారం లో ఉందని, జాగ్రత్తగా వ్యవహరించాలని పలువురు విశ్లేషకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని చెప్తున్నారు. ఈ పాటపై రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పార్టీలు కూడా రియాక్ట్ అయ్యి పెద్ద రచ్చ చేసే అవకాశాలు ఉన్నాయి.

    గతంలో కూడా బాలయ్య ఒక ఈవెంట్ లో ఆడవాళ్ళ గురించి చేసిన కొన్ని కామెంట్స్ పై అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మరియు వైసీపీ పార్టీ నేతలు అసెంబ్లీ లో పెద్ద రచ్చ చేసారు. మళ్లీ అలాంటి పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు. మరోపక్క ఇప్పటి వరకు విడుదలైన ఈ చిత్రం లోని పాటలన్నిట్లో ‘దబిడి దిబిడి’ కే యూట్యూబ్ లో భారీ వ్యూస్ వచ్చాయి. మిగిలిన పాటలు విడుదలై వారం రోజులకు కలిపి వచ్చిన వ్యూస్, ఈ పాటకు కేవలం 24 గంటల్లోనే వచ్చాయి. యూత్ ఆడియన్స్ ఇలాంటి పాటలకు బాగా కనెక్ట్ అవుతున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ వాళ్ళు ఇష్టపడుతున్నారు కదా అని హద్దులు దాటి అడల్ట్ స్టెప్పులు వేయడం సరికాదు. శేఖర్ మాస్టర్ గతంలో కూడా ఇలాంటి పాటలు చాలానే కంపోజ్ చేసాడు. తీవ్రమైన విమర్శలు వచ్చాయి, కానీ ఆయన మాత్రం తన పద్దతి మార్చుకోవడం లేదు.