https://oktelugu.com/

కోహ్లిపై బీసీసీఐ కుట్ర పన్నుతోందా? దక్షిణాఫ్రికా పర్యటనలో రాణించకపోతే అంతేనా?

Virat Kohli: టీమిండియాలో రాజకీయాలు జరుగుతున్నాయి. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లిని తప్పించి రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విమర్శలు వచ్చినా బీసీసీఐదే బాధ్యత అని తప్పించుకున్నారు. ప్రస్తుతం కూడా విరాట్ కోహ్లిని మరోమారు టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తొలగించేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లి ప్రదర్శన సరిగా లేకపోతే టెస్ట్ కెప్టెన్ గా కూడా తీసేసేందుకే నిర్ణయాలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. విరాట్ కోహ్లి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 20, 2021 / 06:26 PM IST
    Follow us on

    Virat Kohli: టీమిండియాలో రాజకీయాలు జరుగుతున్నాయి. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లిని తప్పించి రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విమర్శలు వచ్చినా బీసీసీఐదే బాధ్యత అని తప్పించుకున్నారు. ప్రస్తుతం కూడా విరాట్ కోహ్లిని మరోమారు టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తొలగించేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లి ప్రదర్శన సరిగా లేకపోతే టెస్ట్ కెప్టెన్ గా కూడా తీసేసేందుకే నిర్ణయాలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

    Virat Kohli

    విరాట్ కోహ్లి మంచి ఆటగాడే. పదునైన వ్యూహాలతో జట్టును విజయతీరాలకు చేర్చిన సంర్భాలు ఎన్నో ఉన్నా ప్రస్తుతం అతడి ప్రతిభపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోనే అతడిని జట్టుకు దూరం చేసినట్లు తెలుస్తోంది. కానీ రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించడంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ చొరవే ఉన్నట్లు సమాచారం. ఇటీవల జట్టు యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు పెరుగుతున్నాయి.

    టెస్ట్ సారధిగా కూడా కోహ్లిని తప్పించి రోహిత్ కే పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారని ఓ వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో విరాట్ భవితవ్యంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ పర్యటనలో విరాట్ కోహ్లి రాణించాల్సిన అవసరం ఏర్పడింది. లేకపోతే అతడి కెప్టెన్సీ జారిపోయే ప్రమాదం పొంచి ఉన్నట్లు సమాచారం. అయితే కోహ్లి విషయంలో బీసీసీఐ చర్యలను అందరు వ్యతిరేకిస్తున్నారు.

    Also Read: Kidambi Srikanth: కిడాంబి శ్రీకాంత్ ఓడినా.. బ్యాడ్మింటన్లో చరిత్రే..!

    దక్షిణాఫ్రికా పర్యటనలో రాణించకపోతే అంతే సంగతి అని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఏది ఏమైనా విరాట్ కోహ్లి విషయంలో బీసీసీఐ ఇప్పటికైనా శీతకన్ను వేయకుండా సరైన దిశగా ఆలోచించి విరాట్ ను తొలగించేందుకు ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు.

    Also Read: Kohli vs Ganguly: విరాట్ కోహ్లీ వర్సెస్ గంగూలీ.. ట్విట్టర్ లో ట్రెండింగ్ ఇదే

    Tags