Rajamouli: ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం చాలా అవసరం. ఓ వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సక్సెస్ ట్రాక్ లో ఉండి ఏమాత్రం ఓవర్ గా మాట్లాడినా, వీడికి తల పొగరు ఎక్కువైంది అంటారు. దర్శకుడు రాజమౌళి ఈ విషయంలో చాలా కేర్ ఫుల్. వేదిక ఏదైనా తనని తాను ఎక్కడా ఎక్కువ చేసుకొని మాట్లాడరు. వీలైనంత వరకు తన ఇమేజ్ తక్కువ చేసుకొని మాట్లాడతారు. ఇతర దర్శకుల సినిమా ఫంక్షన్స్ కి వెళితే రాజమౌళి తనలోని లోపాలు, సదరు సినిమా డైరెక్టర్స్ క్వాలిటీస్ ఎక్కువ చేసి మాట్లాడతారు.
నిజానికి రాజమౌళి స్థాయి దేశం ఎల్లలు కూడా దాటిపోయింది. ఆయన గురించి కొంచెం గొప్పగా చెప్పుకున్నా జనాలు అంగీకరిస్తారు. అపజయం లేని దర్శకుడిగా రాజమౌళి ఆ స్థాయిలో ఉన్నారు. ఆశ్చర్యంగా రాజమౌళి మాత్రం తనని తాను డిఫేమ్ చేసుకొని మాట్లాడతారు. ఇది చాలా సందర్భాల్లో రుజువైంది. ఓసారి దర్శకుడు పూరి జగన్నాధ్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వెళ్లిన రాజమౌళి… మీ దగ్గర అసిస్టెంట్ గా చేరమని తన వైఫ్ రమ సలహా ఇచ్చారని ఓపెన్ గా చెప్పారు.
ఏళ్లకు ఏళ్ళు సినిమాలు తీయడం కాదు, పూరీలా మూడు నెలల్లో సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాలి. ఆ విషయంలో మీరు పూరి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని భార్య రమ చెప్పినట్లు రాజమౌళి అన్నారు. ఇక్కడ పూరీని ఎలివేట్ చేస్తూనే… తనని తాను డిఫేమ్ చేసుకున్నారు. ఇక నిన్న బిగ్ బాస్ వేదిక సాక్షిగా రాజమౌళి ఇదే తరహాలో ప్రవర్తించారు.
నాగార్జున మీ పేరులోని ఎస్ ఎస్… ఫుల్ ఫార్మ్ తెలుసుకోవాలని ఉందని అడుగగా.. శ్రీశైలం శ్రీ రాజమౌళి అని చెప్పారు. అంతటిలో ఆగకుండా ఇంగ్లీష్ లో చెప్పాలంటే సక్సెస్.. స్టుపిడ్ అన్నారు. దీనికి నాగార్జున సక్సెస్ అంటే ఒప్పుకుంటాను, కానీ స్టుపిడ్ అంటే ఒప్పుకోనన్నారు. నాకు సినిమా తప్ప మిగతా విషయాల్లో నాలెడ్జ్ జీరో.. అందుకే నేను స్టుపిడ్ అంటూ తన కామెంట్ ని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.
Also Read: Hamsa Nandini: క్యాన్సర్తో బాధపడుతున్న ప్రముఖ హీరోయన్.. ఎవరో తెలుసా?
ఇండియా మెచ్చిన రాజమౌళి తనని తాను ఇలా డిఫేమ్ చేసుకోవడం ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది. అదే సమయంలో ఆయన ఈ స్ట్రాటజీ వెనుక ఆంతర్యం ఏమిటనే ఆసక్తి రేగుతుంది. రాజమౌళి ఈ తరహా ప్రవర్తనకు కారణం… తాను ఎంత సక్సెస్ సాధించినా గర్వం లేదని నిరూపించుకోవడం కోసమని అర్థమవుతుంది.
Also Read: Pushpa Day2 Collections: రెండో రోజుకే 100 కోట్ల క్లబ్లో చేరిపోయిన ‘పుష్ప’రాజ్