https://oktelugu.com/

BiggBoss5 Telugu: బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఎవరికి ఎక్కువంటే?

BiggBoss5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ ఘనంగా ముగిసింది. ఈసారి ఓ సామాన్యుడు బిగ్ బాస్ టైటిల్ నెగ్గాడు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ యాంకర్ రవి, యూట్యూబర్ షణ్ముఖ్, శ్రీరామచంద్ర , ఆనీ మాస్టర్ లాంటి గట్టి ప్రత్యర్థులను దాటుకొని మరీ సన్నీ గెలిచాడు. 19మందితో మొదలైన ఈ షోలో చివరకు సన్నీ, శ్రీరామ్, మానస్, సిరి, షణ్ముఖ్ టాప్5 కంటెస్టెంట్స్ గా మిగిలారు. షణ్ముఖ్ రన్నర్ గా.. సన్నీ విజేతగా నిలిచాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 20, 2021 6:32 pm
    Follow us on

    BiggBoss5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ ఘనంగా ముగిసింది. ఈసారి ఓ సామాన్యుడు బిగ్ బాస్ టైటిల్ నెగ్గాడు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ యాంకర్ రవి, యూట్యూబర్ షణ్ముఖ్, శ్రీరామచంద్ర , ఆనీ మాస్టర్ లాంటి గట్టి ప్రత్యర్థులను దాటుకొని మరీ సన్నీ గెలిచాడు.

    19మందితో మొదలైన ఈ షోలో చివరకు సన్నీ, శ్రీరామ్, మానస్, సిరి, షణ్ముఖ్ టాప్5 కంటెస్టెంట్స్ గా మిగిలారు. షణ్ముఖ్ రన్నర్ గా.. సన్నీ విజేతగా నిలిచాడు. వీరిద్దరికి బాగానే రెమ్యూనరేషన్ దక్కింది.

    బిగ్ బాస్ విజేతగా నిలిచిన సన్నీ వారానికి రూ.2 లక్షలు తీసుకున్నట్లు టాక్. అంటే 15 వారాల్లో రూ.30 లక్షలు సంపాదించినట్టు టాక్ నడుస్తోంది. ఇక బిగ్ బాస్ విజేతగా నిలిచినందుకు 50 లక్షలతోపాటు సువర్ణభూమి నుంచి ఒక రూ.25 లక్షల ఫ్లాట్ కూడా దక్కించుకున్నాడు. మొత్తంగా ట్యాక్సులు పోను కోటి వరకూ సంపాదించాడని తెలుస్తోంది.

    ఇక యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ వారానికి రూ.2 లక్షల వరకూ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. 15 వారాలకు గాను రూ.30 లక్షలు తీసుకున్నట్లు సమాచారం.

    మూడో స్థానంలో నిలిచిన సింగర్ శ్రీరామచంద్ర కూడా రెమ్యూనరేషన్ ఎక్కువగానే తీసుకున్నట్లుగా సమాచారం. ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచి ఎంతో పాపులారిటీ అందుకున్న శ్రీరామచంద్ర వారానికి లక్షన్నర తీసుకున్నాడని సమాచారం.

    4వ స్థానంలో నిలిచిన మానస్ కూడా ఎక్కువగానే రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ షో ద్వారా వారానికి లక్ష నుంచి లక్షన్నర వరకు రెమ్యూనరేషన్ అందుకున్నాడట.. అంటే 15 వారాలకు సుమారు రూ.20లక్షల వరకూ అందుకోనున్నట్టు సమాచారం.

    ఇక 5వ స్థానంలో నిలిచిన సిరి ఈ షో ద్వారా రెమ్యూనరేషన్ బాగానే దక్కించుకుందని సమాచారం. వారానికి రూ.లక్షన్నర వరకూ అందుకున్నట్లు సమాచారం. 15 వారాలకు గాను సుమారు 25 లక్షల వరకూ పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.