https://oktelugu.com/

Irfan Pathan: వైరల్.. పాకిస్తాన్ పరువు తీసిన ఇర్ఫాన్ పఠాన్.. ఆ ట్వీట్ లో ఏముందంటే..?

పాకిస్తాన్ టీం పరిస్థితిని చూసి నవ్వుకుంటున్నారు. ఎందుకంటే వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వకముందు వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ , ఇండియా మీద వాళ్ళు చేసిన కామెంట్లను చూస్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్లకు ఇలా జరగాల్సిందే అని అనుకుంటారు.

Written By: , Updated On : October 28, 2023 / 09:43 AM IST
Irfan Pathan

Irfan Pathan

Follow us on

Irfan Pathan: వరల్డ్ కప్ లో భాగంగా సౌతాఫ్రికా, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడం జరిగింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరి వరకు పోరాడి సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్స్ ఆ టీం కి అద్భుతమైన విజయాన్ని అందించారు.ఇక ఈ క్రమంలో పాకిస్తాన్ వరుసగా నాలుగో మ్యాచ్ ని ఓడిపోయి వాళ్ళ అభిమానులకి తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇక ఈ క్రమంలో ఇలాంటి టీం సెమిస్ కి క్వాలిఫై అవడం చాలా కష్టమనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఆస్ట్రేలియా టీం సెమిస్ లోకి అడుగు పెట్టడానికి తహతహలాడుతూ వరుసగా మ్యాచ్ లు విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది.

ఇక ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ లీగ్ దశలోనే ఇంటికి వెళ్లిపోయే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఇండియా , సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి టీమ్ లు వరుస విజయాలను అందుకుంటూ టాప్ త్రీ పొజిషన్ లో కొనసాగగా ఈ మూడు జట్లు కూడా సెమీస్ కి వెళ్లడానికి ఒక అడుగు దూరంలో ఉన్నాయి.ఇక ఈ మూడు టీములు ఒక మ్యాచ్ గెలిచినా కూడా సెమిస్ లోకి అడిగు పెట్టే అవకాశం అయితే ఉంది.ఇక ఇలాంటి క్రమంలో నెంబర్ 4 బెర్త్ కోసం ఆస్ట్రేలియా కూడా పోటీలో ఉంది. పాకిస్తాన్ టీం చెత్త పర్ఫామెన్స్ తో వాళ్ల చేతుల్లోకి వచ్చిన మ్యాచ్ ను కూడా పోగొట్టు కున్నారు.

వరల్డ్ కప్ లో చెత్త పర్ఫామెన్స్ ని ఇస్తు సౌతాఫ్రికా మీద పాకిస్తాన్ ఓడిపోయిన సందర్భంగా ఇండియన్ మాజీ క్రికెటర్ అయిన ఇర్ఫాన్ పఠాన్ తన ట్విట్టర్ లో ఫ్లైట్ దగ్గర ఉన్న పాకిస్తాన్ ప్లేయర్ల ఫోటోని షేర్ చేస్తూ pakisthan became the first team which qualify for airport అంటు టెక్స్ట్ రాసి దానికి స్మైల్ సింబల్ ని ఆడ్ చేసి పాకిస్తాన్ ప్లేయర్ల మీద వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ పోస్ట్ చూసిన ఇండియన్ అభిమానులు సంతోష పడుతున్నారు.

అలాగే ప్రస్తుతం పాకిస్తాన్ టీం పరిస్థితిని చూసి నవ్వుకుంటున్నారు. ఎందుకంటే వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వకముందు వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ , ఇండియా మీద వాళ్ళు చేసిన కామెంట్లను చూస్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్లకు ఇలా జరగాల్సిందే అని అనుకుంటారు.వాళ్ళు ఎప్పుడూ కూడా మేము ఇండియా కంటే తక్కువ కాదు అని చెప్పుకుంటూ వస్తారు. ఇప్పుడు ఈ వరల్డ్ కప్ లో ఇండియా వరుస విజయాలతో ఫస్ట్ పొజిషన్ లో ఉంటే పాకిస్తాన్ ఎక్కడో చివర్లో ఉంది. ఇప్పటికైనా ఇండియాతో పోటీ పడాలి అంటే పాకిస్థాన్ కి ఉన్న సామర్థ్యం సరిపోదని వాళ్లకు వాళ్ళు తెలుసుకుంటే మంచిది…

 

Irfan Pathan

Irfan Pathan