Odi World Cup 2023: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ టీమ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ టీమ్ కి భారీ షాకిస్తూ అఫ్గానిస్తాన్ టీమ్ ఘన విజయాన్ని సాధించింది. ఇక ఇప్పటికే డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఇంగ్లాండుకు షాక్ ఇస్తూ తన మొదటి విజయాన్ని నమోదు చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్ టీం ఇప్పుడు పాకిస్తాన్ టీమ్ కి కూడా షాక్ ఇచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక ఇలాంటి క్రమంలో ఆఫ్గనిస్తాన్ ఈ మ్యాచ్ గెలిచిన సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు తనదైన రీతిలో డాన్సులు చేస్తూ వాళ్ల సంబరాలను జరుపుకున్నారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో అఫ్గాన్ టీమ్ విజయం లో కీలక పాత్ర వహించిన ఇబ్రహీం జద్రాన్, అలాగే అఫ్గాన్ కెప్టెన్ అయిన శాహిది కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తూ తమ టీం ని విజయతీరాలకు చేర్చారు. ఇక ముఖ్యంగా షాహిది మ్యాచ్ విన్నింగ్ షాట్ ని కొట్టి ఆఫ్ఘనిస్తాన్ టీం కి భారీ విజయాన్ని అందించాడు.ఇక డగౌట్ లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు కూడా సంతోషంగా డాన్సులు చేశారు. ఇక స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు దృఢ సంకల్పంతో ఏమాత్రం భయం లేకుండా చివరి వరకు మ్యాచ్ ని గెలిపించే దిశగా ఆడుతూ ఆ టీం కి భారీ విజయాన్ని అందించడం చూసి ప్రేక్షకులు విపరీతమైన అరుపులు కేరింతలు చేశారు.అక్కడ ఉన్న ప్రేక్షకుల అభిమానాన్ని చోరగున్న ఆఫ్ఘనిస్తాన్ టీం సపోర్టుగా అభిమానులు కూడా స్టాండింగ్ ఓవేశన్ చేస్తూ టీం కి భారీ సపోర్ట్ ని అందించారు.
ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ గెలుపుని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక అప్పటికే గ్రౌండ్ లో స్టాండింగ్ కామెంటరీ చేస్తున్న ఇండియన్ మాజీ ప్లేయర్ అయిన ఇర్ఫాన్ పఠాన్ ఆఫ్గనిస్తాన్ ప్లేయర్లని చూస్తు డాన్సులు వేశాడు.ఇక ఇది చూసిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ప్లేయర్ అయిన రషీద్ ఖాన్ కూడా ఇర్ఫాన్ పఠాన్ తో కలిసి డాన్స్ చేయడం జరిగింది.ఇక ఆ తర్వాత ఇద్దరు కౌగిలించుకున్నారు ఈ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ వాళ్ల కి కంగ్రాట్స్ కూడా చెప్పాడు…
ఇక ఈ ఓటమితో పాకిస్థాన్ వరుసగా ఇండియా,ఆస్ట్రేలియా, ఆఫ్గనిస్తాన్ టీమ్ ల మీద ఓడిపోయి ఓటమిలో హ్యాట్రిక్ సాధించింది…దీంతో అఫ్గాన్ రెండు విజయాలను సాధించి పెద్ద జట్లకి కూడా పోటీ ఇస్తుంది…ఇక ఇప్పటికీ కూడా అఫ్గాన్ టీమ్ సెమీస్ ఆశలను పదిలంగా ఉంచుకుంది…
Irfan Pathan dancing with Rashid khan pic.twitter.com/pVK7vFqtdI
— All About Cricket (@allaboutcric_) October 23, 2023