https://oktelugu.com/

Irfan Pathan: ఆస్థానంలో లేకపోయి ఉంటే రోహిత్ ఇప్పటికే బయటికి వెళ్లి పోయేవాడు: ఇర్ఫాన్ పఠాన్

స్వదేశంలో న్యూజిలాండ్ తో భారత్ 3 టెస్టులలో ఓడిపోయింది. దారుణమైన ఆట తీరు ప్రదర్శించి తీవ్రస్థాయిలో విమర్శలను మూట కట్టుకుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 31, 2024 / 09:21 AM IST

    Irfan Pathan

    Follow us on

    Irfan Pathan: న్యూజిలాండ్ జట్టుతో సిరీస్ పూర్తయిన తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించింది. దక్షిణాఫ్రికాపై టి20 సిరీస్ గెలుచుకుంది. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిపోయింది. వ్యక్తిగత కారణాలవల్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ టెస్ట్ కు అందుబాటులో లేడు. వైస్ కెప్టెన్ బుమ్రా జట్టుకు తాత్కాలికంగా నాయకత్వం వహించాడు. ఇదే క్రమంలో పెర్త్ టెస్టులో తనదైన చాకచకాన్ని ప్రదర్శించి టీమిండియా కు 295 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందించాడు. దీంతో అప్పటిదాకా టెస్ట్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉన్న టీం ఇండియా ఒక్కసారిగా మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఇక ఇదే సమయంలో అడిలైడ్ టెస్ట్ కు రోహిత్ అందుబాటులోకి వచ్చాడు.. ఈ మ్యాచ్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది.. బ్రిస్ బేన్ లో ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకుంది.. మెల్ బోర్న్ లో దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఇలా మూడు టెస్టులలో రోహిత్ శర్మ వ్యక్తిగత వైఫల్యం.. నాయకత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. దీనిపై సీనియర్లు విమర్శలు చేస్తున్నప్పటికీ బీసీసీఐ మేనేజ్మెంట్ రోహిత్ పై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మెల్ బోర్న్ ఓటమి తర్వాత రోహిత్ శర్మ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

    తప్పించి ఉండేవారు

    అత్యంత దారుణమైన ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మను కెప్టెన్ కాకపోయి ఉంటే కచ్చితంగా జట్టు నుంచి తప్పించి ఉండేవారని ఇర్ఫాన్ వ్యాఖ్యానించాడు. ” అతడి ఫామ్ ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకు ఇంత దరిద్రంగా ఆడుతున్నాడో అర్థం కావడం లేదు. అసలు ఆడుతోంది రోహిత్ శర్మేనా అని అనుమానం కలుగుతోంది. అతడికి ఏ పని కాబట్టి ఇంకా జట్టులో కొనసాగిస్తున్నారు. వేరే ఆటగాడు అయితే బయటికి పంపించే వారు. అతడు పరుగులు కూడా చేయలేకపోతున్నాడు. భారంగా అడుగులు వేస్తున్నాడు. అతడు కనక జట్టులో లేకపోయి ఉంటే రాహుల్ లేదా గిల్ ఓపెనర్లుగా వచ్చేవాళ్ళు. అప్పుడు జట్టు స్థితి వేరే విధంగా ఉండేది. ఇక్కడ నిజాలు మాట్లాడుకుంటే ఇలానే ఉంటుంది. ఎలా ఆలోచిస్తుందో? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నదో? మేనేజ్మెంట్ ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దారుణమైన ఫామ్ ఉన్న ఆటగాడిని కెప్టెన్గా కొనసాగించి బీసీసీఐ ఎలాంటి మెసేజ్లు ఇస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితి టీమిండియాలో గతంలో ఎన్నడూ లేదు. వ్యక్తి పూజకు అలవాటు పడితే ఫలితాలు ఇలానే ఉంటాయి. ఇప్పటికైనా బీసీసీఐ కళ్ళు తెరవాలి. లేకపోతే ఫలితాలు మరింత దారుణంగా ఉంటాయని” ఇర్ఫాన్ ఒకింత ఆగ్రహ స్వరంతో వ్యాఖ్యానించాడు. రోహిత్ ఫామ్ పై ఇప్పటికే రవి శాస్త్రి, సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ జాబితాలో ఇర్ఫాన్ కూడా చేరిపోయాడు.