Srileela : సోషల్ మీడియా వృద్ధి లోకి రావడం శుభ పరిణామమే. దీనిని నెటిజెన్స్ తమ అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఎన్నో లాభాలు, బోలెడంత పరిజ్ఞానం కూడా దొరుకుతుంది. కానీ కొంతమంది సోషల్ మీడియా ని వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఫేక్ న్యూస్ లను ప్రచారం చేస్తూ ప్రముఖ సెలబ్రిటీస్ ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. పైగా ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వృద్ధి లోకి వచ్చింది. దీని వల్ల ఉపయోగాలు ఏ రేంజ్ లో అయితే ఉన్నాయో, నష్టాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. అవి సెలబ్రిటీస్ జీవితాలను తలక్రిందులు చేసే విధంగా కూడా ఉంటున్నాయి. డీప్ ఫేక్ అనే యాప్ ద్వారా వీడియోలను మార్ఫింగ్ చేయడం వంటివి మనం చాలానే చూసాము. నిన్న గాక మొన్న సమంత , కీర్తి సురేష్ వంటి హీరోయిన్లు గర్భాలు దాల్చినట్టు కొన్ని ఫోటోలను మనం సోషల్ మీడియా లో చూసే ఉంటాము.
ఆ ఫోటోలను చూసినప్పుడు మనకి ఒక్క శాతం కూడా ఫేక్ అనిపించలేదు. నిజంగానే సమంత గర్భం దాల్చిందా..?, నిన్న గాక మొన్న పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ అప్పుడే గర్భవతి ఎలా అయ్యింది అని నెటిజెన్స్ మాట్లాడుకోవాల్సి వచ్చింది. అంత నేచురల్ గా ఉన్నాయి ఆ మార్ఫింగ్ ఫోటోలు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఈ రేంజ్ లో ఫేక్ చెయ్యొచ్చు అన్నమాట. సమంత, కీర్తి సురేష్, రష్మిక వంటి హీరోయిన్లు టాప్ సెలెబ్రిటీలు కాబట్టి, వాళ్లకు పెద్ద ఇలాంటివి ఇబ్బంది కలిగించకపోవచ్చు. ఎందుకో వాళ్ళ మీద రోజుకి వందల కొద్దీ కథనాలు వస్తుంటాయి. వాళ్ళ స్థానం లో ఒక సాధారణ మహిళ ఉంటే ఏంటి పరిస్థితి?, అస్లీలంగా మార్ఫులు చేసి ఆకతాయిలు వాళ్ళని బెదిరించి, ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించే ప్రమాదం ఉంది కదా?, దీనికి అడ్డుకట్ట ఎలా వెయ్యాలి అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు.
అయితే సోషల్ మీడియా ని ఎలా ఉపయోగించుకోవాలి, అదే విధంగా ఫేక్ ప్రచారాలు చెయ్యొద్దు అంటూ సినీ సెలబ్రిటీస్ ద్వారా ఒక క్యాంపైన్ ని రన్నింగ్ చేస్తుంది ప్రభుత్వం. అందులో భాగంగా ప్రముఖ హీరోయిన్ శ్రీలీల కూడా ఈ క్యాంపైన్ లో భాగం పంచుకుంది. ఆమె దీని గురించి మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో లైక్స్ కోసం, వ్యూస్ కోసం, ఫేక్ వార్తలు ప్రచారం చేయకండి. ఇవన్నీ కాదని వ్యూస్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయకండి. అసత్య ప్రచారాలకు దూరంగా ఉండండి. సోషల్ మీడియా ని మంచి కోసం ఉపయోగిద్దాం’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. శ్రీలీల కి ఇంస్టాగ్రామ్ లో మిలియన్ల సంఖ్యలో ఫాలోయర్స్ ఉండడంతో ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. కేవలం శ్రీలీల ఒక్కటే కాదు, త్వరలో టాప్ స్టార్స్ అందరూ ఈ ప్రచారం లో భాగం కాబోతున్నారు.
సోషల్ మీడియాను మన మంచి కోసం వాడుదాం అసత్య ప్రచారాలకు దూరంగా ఉందాం – శ్రీలీల@sreeleela14 #Sreeleela pic.twitter.com/I8TlesZ7Dj
— Team Sreeleela™️ (@Teamsreeleela) December 30, 2024