https://oktelugu.com/

Irani Cup 2024: 27 ఏళ్ల తర్వాత “ఇరానీ” విజేత ముంబై.. కప్ గెలిచిన విధానమే ఆశ్చర్యకరం..

ముంబై జట్టు నక్కతో తొక్కింది. అదృష్టం మెయిన్ డోర్ తీసింది. అందువల్లే 27 సంవత్సరాల తర్వాత ఇరానీ కప్ గెలిచింది. దేశవాళి క్రికెట్ టోర్నీలో సంచలనాన్ని సృష్టించింది. బహుశా ముంబై తన దేశవాళి క్రికెట్ చరిత్రలో ఈ స్థాయిలో గతంలో విజయాన్ని సొంతం చేసుకోలేదనుకుంట.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 6, 2024 / 09:47 AM IST

    Irani Cup 2024

    Follow us on

    Irani Cup 2024: 27 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ముంబై జట్టు ఇరానీ కప్ విజేతగా నిలిచింది. రెస్ట్ ఆఫ్ ఇండియా తో జరిగిన మ్యాచ్ డ్రాగ ముగిసినప్పటికీ.. ముంబై విజేతగా ఆవిర్భవించింది. దీంతో ఆ జట్టు ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేవు. వాస్తవానికి టెస్ట్ క్రికెట్లో రెండు ఇన్నింగ్స్ లలో లీడ్ కొనసాగించి.. ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకు కట్టడి చేస్తే.. ఆ జట్టు గెలుస్తుంది. కానీ ఇరానీ కప్ లో ముంబై జట్టుకు ప్రతిదీ అనుకూలంగానే మారింది. ముంబై జట్టు తొలిసారి 1997 -98 లో ఇరానీ కప్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ విజేతగా నిలవలేదు. పలుమార్లు ట్రోఫీ గెలిచే అవకాశం వచ్చినప్పటికీ.. ఒత్తిడిలో ముంబై జట్టు ఓడిపోయింది.. ఇక తాజా మ్యాచ్ విషయానికి వస్తే.. శనివారం ఓవర్ నైట్ స్కోర్ 153/6తో రెండవ ఇన్నింగ్స్ ను ముంబై జట్టు మొదలుపెట్టింది.. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లు సరిగ్గా బౌలింగ్ చేయకపోవడంతో 329/8 వద్ద తన ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా ఎదుట 451 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ముంబై జట్టులో తనుష్ (114*) అజేయ శతకం సాధించాడు. అయితే చివరి రోజు ఒక సెషన్ ఆట మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో రెస్టాఫ్ ఇండియా కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ డ్రా కు అంగీకరించాడు. ఇక తొలి ఇన్నింగ్స్ లో ముంబై జట్టు 537 ప్రాన్స్ చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా 416 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీ చేశాడు. ఫలితంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కించుకున్నాడు.

    మ్యాచ్ డ్రా గా ముగిసినప్పటికీ..

    మ్యాచ్ డ్రా గా ముగిసినప్పటికీ.. ముంబై జట్టును నిర్వాహకులు విజేతగా ప్రకటించారు. రెస్ట్ ఆఫ్ ఇండియా తో జరిగిన ఈ మ్యాచ్లో ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్ లో తిరుగులేని లీడ్ దక్కించుకుంది. దీంతో ఆ ఇన్నింగ్స్ లో స్కోర్ ఆధారంగా ముంబై జట్టును విజేతగా ప్రకటించారు. ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్ లో 537 రన్స్ చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా 416 పరుగులకు మాత్రమే పరిమితమైంది. తొలి, రెండవ ఇన్నింగ్స్ ల ప్రకారం చూసుకుంటే.. రెస్ట్ ఆఫ్ ఇండియా ఎదుట ముంబై జట్టు 451 రన్స్ టార్గెట్ ను ఉంచింది. దీంతో ఒక సెషన్ ఆట మాత్రమే మిగిలి ఉండడంతో.. ఆ పరుగులను రెస్ట్ ఆఫ్ ఇండియా చేదించే అవకాశం లేకుండా పోయింది. దీంతో రెస్టాఫ్ ఇండియా జట్టు కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ మ్యాచ్ డ్రా గా ప్రకటించేందుకు తన సమ్మతం తెలిపాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యం ఆధారంగా ముంబై జట్టును విజేతగా ప్రకటించారు. అయితే రెండవ ఇన్నింగ్స్ లో ముంబై ఆటగాడు తనుష్ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. అజేయంగా 114 పరుగులు చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్ లో ముంబై జట్టు తరుపున డబుల్ సెంచరీ చేసిన సర్పరాజ్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కించుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో అతడు భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆ స్థాయిలో ఆట తీరు ప్రదర్శించకపోవడంతో అతడు జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ లో స్థానం సంపాదించినప్పటికీ.. అతని స్థానానికి జట్టులో స్థిరత్వం లేకుండా పోయింది. దీంతో ఎలాగైనా జట్టులో చోటు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో అతడు దేశవాళి క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన పూర్వపు ఫామ్ దొరకబుచ్చుకొని.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.