ఐపీఎల్ ట్రెండ్స్: ఆ రెండు టీంలు సైలెంట్ కిల్లర్ లు

ఐపీఎల్ ఫీవర్ అందరికీ వచ్చేసింది. ఈ మెగా ఈవెంట్ ను కరోనా కల్లోలంలోనూ నిర్వహించడానికి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి కూడా అన్ని జట్ల కంటే ముంబై ఇండియన్స్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఢిల్లీ కూడా బలంగా కనిపిస్తోంది. అయితే ఏక్షణాన ఏం జరుగుతుందో తెలియని టీ20లో ఏ జట్టుది గెలుపో చెప్పడం కష్టం. ఐపీఎల్ 14వ సీజన్ రెండు రోజుల్లో మొదలుకావడానికి సిద్ధమైంది. ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ […]

Written By: NARESH, Updated On : April 8, 2021 12:10 pm
Follow us on


ఐపీఎల్ ఫీవర్ అందరికీ వచ్చేసింది. ఈ మెగా ఈవెంట్ ను కరోనా కల్లోలంలోనూ నిర్వహించడానికి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి కూడా అన్ని జట్ల కంటే ముంబై ఇండియన్స్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఢిల్లీ కూడా బలంగా కనిపిస్తోంది. అయితే ఏక్షణాన ఏం జరుగుతుందో తెలియని టీ20లో ఏ జట్టుది గెలుపో చెప్పడం కష్టం.

ఐపీఎల్ 14వ సీజన్ రెండు రోజుల్లో మొదలుకావడానికి సిద్ధమైంది. ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ వంటి పెద్ద జట్లపై ఈసారి అందరి దృష్టి ఉంది. కానీ చాలా సమతుల్యమైన రెండు జట్లు టైటిల్ ఫేవరెట్లలో సైలెంట్ గా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడానికి డార్క్ హార్స్ గా అవి బరిలో ఉన్నాయంటున్నారు. ఆ జట్లు పంజాబ్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ అంటున్నారు.

పంజాబ్ కింగ్స్ గత సీజన్ లో బాగా ప్రారంభించింది. కానీ మధ్యలో వరుస పరాజయాలు పొందింది. ప్రతి ఒక్కరూ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించవచ్చని భావించారు. కానీ చివరి మ్యాచుల్లో కొన్ని పొరపాట్లు ఆ జట్టును ఫ్లే ఆఫ్స్ కు దూరం చేశాయి.. ఈ సీజన్‌లో ఇలాంటి తప్పులను పునరావృతం చేయకూడదని వారు ఇప్పుడు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. పంజాబ్ కింగ్స్ ఈసారి వేలంపాటల్లో ప్రపంచంలోనే టీ20 నంబర్ 1 ఆటగాడు డేవిడ్ మలన్, రిలే మెరెడిత్, మొయిసెస్ హెన్రిక్స్ మరియు ఫాబియన్ అలెన్ రూపంలో మంచి విదేశీ ఆటగాళ్లను పంజాబ్ కొనుగోలు చేసింది.

ఇక పంజాబ్ కు మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్, గేల్ / పూరన్ లు అరవీర భయంకరంగా ఉన్నారు. వీరితోపాటు డేవిడ్ మలన్ మరియు మిడిల్ ఆర్డర్‌లో హెన్రిక్స్ / అలెన్ వంటి స్టార్ ప్లేయర్‌లతో బ్యాటింగ్ బలంగా కనిపిస్తుంది. ఇక బౌలింగ్‌కు మహ్మద్ షమీ నాయకత్వం వహిస్తాడు. అతడికి రిచర్డ్‌సన్ / మెరెడిత్, రవి బిష్ణోయ్ మరియు మురుగన్ అశ్విన్ నుండి మంచి మద్దతు లభిస్తుంది. జట్టు చాలా సమతుల్యతతో కనిపిస్తుంది. ఈ టీం ఈసారి ప్లేఆఫ్‌లోకి రావడానికి మంచి అవకాశం ఉంది.

మరో వైపు, రాజస్థాన్ రాయల్స్ తమ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ను విడిచిపెట్టడానికి పెద్ద నిర్ణయం తీసుకుంది.. వారు ఇప్పుడు సంజు సామ్సన్‌ను కెప్టెన్‌గా చేశారు. తమ క్రికెట్ డైరెక్టర్‌గా కుమార సంగక్కరను తీసుకున్నారు. బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, జోఫ్రా ఆర్చర్ వంటి వారితో జట్టు బాగా కనిపిస్తోంది. యువకులు రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా మరియు సంజు సామ్సన్ ఇప్పటికే ప్రతిభను నిరూపించారు. మంచి జట్టు, సామర్థ్యం ఉండడంతో ఈ టీం సమతూకంగా కనిపిస్తోంది. వీరు ఖచ్చితం గా ఫ్లే ఆఫ్స్ కు చేరుకుంటారనే ధీమా ఉంది.