IPL Rescheduled 2025: దాయాది దేశంతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాల మైదానంలో పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ సడన్ గా ఆగిపోయింది. ఇక అప్పట్నుంచి ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడుతూనే ఉంది. సరిగా నాలుగు రోజుల క్రితం ఫైరింగ్ నిలుపుదల చేస్తామని ఇరు దేశాల ప్రతినిధులు అంగీకరించడంతో పరిస్థితి కాస్త సడలిపోతుందని అందరూ అనుకున్నారు. అయితే మళ్లీ ఫైరింగ్ మొదలు కావడంతో పరిస్థితి లో ఏమాత్రం మార్పు కనిపించలేదు. దీంతో బిసిసిఐ పెద్దలు తీవ్ర ఆలోచనలో పడ్డారు. ప్రతిరోజు మ్యాచ్లు నిర్ణీత సమయానికి నిర్వహించే అవకాశం ఉంటే ఈ సమయం వరకు ఐపీఎల్ దాదాపు గ్రూప్ సమరాన్ని ముగించుకొని క్వాలిఫైయర్ దశకు వచ్చేది. కానీ అనుకోని అవాంతరాల వల్ల ఐపీఎల్ నిర్వహణకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోంది. అయితే ఎట్టకేలకు బీసీసీఐ పెద్దలు రీ షెడ్యూల్ ప్రకటించారు.
Also Read: భయం పేరుతో ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ నాటకం.. దాని వెనుక అసలు నిజం ఇదీ!
రీ షెడ్యూల్ ప్రకారం
బిసిసిఐ వెల్లడించిన రీ షెడ్యూల్ ప్రకారం మొత్తం 17 మ్యాచ్లను ఆరు వేదికలలో నిర్వహించనున్నారు.. ఇందులో రెండు డబుల్ హెడర్ మ్యాచ్ లు ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ జూన్ 3న సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు జరగనుంది. రీ షెడ్యూల్ ప్రకారం తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య బెంగళూరు వేదికగా మే 17న శనివారం సాయంత్రం 7:30 నుంచి జరగనుంది. ఇక హైదరాబాద్ జట్టు మే 19న లక్నో వేదికగా లక్నో జట్టుతో తలపడుతుంది.. మే 23న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో బెంగళూరు వేదికగా హైదరాబాద్ తలపడుతుంది. అయితే ఇప్పటికే హైదరాబాద్ ఐపిఎల్ నుంచి నిష్క్రమించింది. గత సీజన్లో చివరి అంచదాకా వెళ్లి.. రన్నరప్ గా నిలిచింది. ఇక ఈసారి సీజన్లో బెంగళూరు, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ, ముంబై ప్లే ఆఫ్ రేసులో ఉన్నాయి. ఇందులో బెంగళూరు, గుజరాత్ జట్లకు మార్గం సుగమం కాగా.. మిగతా రెండు స్థానాలకు ఇతర జట్లు పోటీ పడాల్సి ఉంటుంది.. వాస్తవానికి ఈ మ్యాచ్లు ముందుగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వేదికలుగా నిర్వహిస్తామని అనుకున్నారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ.. ఒక్కసారిగా వేదికల సంఖ్య అరుకు చేరుకుంది. అంతేకాదు వేదికలు కూడా మార్పునకు గురయ్యాయి. హైదరాబాద్, చెన్నై మైదానంలో పక్కనపెట్టి.. ఐపీఎల్ నిర్వాహక కమిటీ బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్ వేదికలలో మ్యాచులు నిర్వహించాలని నిర్ణయించింది.. మొత్తంగా ఈ మైదానాలలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర బలగాలు భద్రతను పర్యవేక్షించనున్నాయి. మరోవైపు గత షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన మ్యాచ్లను బిసిసిఐ రద్దు చేసింది. అంతేకాదు టికెట్ల విక్రయం ద్వారా స్వీకరించిన నగదును..ఆయా అభిమానులకు రిఫండ్ చేయనుంది.
View this post on Instagram