Trivikram and Venky : ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ రైటర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)… ఆయన రైటర్ గా మంచి విజయాలను అందుకున్న తర్వాత దర్శకుడిగా మారి పలు సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఆయనకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఆయన రైటర్ గా వెంకటేష్ హీరోగా వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావు’, ‘ మల్లీశ్వరి’ లాంటి సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా రాబోతుంది. అయితే త్రివిక్రమ్ దర్శకుడిగా మారినప్పటి నుంచి వెంకటేష్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇప్పుడు మాత్రం వెంకటేష్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించడంతో వెంకటేష్ తో చేయబోయే సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుంది అంటూ అతని అభిమానులు చాలా వరకు ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read : గుంటూరు కారం ట్విట్టర్ టాక్: మహేష్ బాబు వన్ మ్యాన్ షో, థియేటర్ దద్దరిల్లే సీన్స్ ఇవే!
ఇకమీదట చేయబోతున్న ఈ సినిమా ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటుంది. తద్వారా వెంకటేష్ కి ఎలాంటి గుర్తింపుని తెచ్చిపెడుతుంది అనేది తెలియాల్సి ఉంది… ఇక ‘గుంటూరు కారం’ (Gunturu Kaaram) సినిమా ఫ్లాప్ అవ్వడంతో అల్లు అర్జున్ తో చేయాలనుకున్న ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది.
అందుకే త్రివిక్రమ్ వెంకటేష్ తో ఒక భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించి అందరి చేత శభాష్ అనిపించుకోవాలని చూస్తున్నాడు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియాలో ఈయనకి పెద్దగా మార్కెట్ అయితే లేదు.కాబట్టి ఏ స్టార్ హీరో కూడా తనను పట్టించుకోవడం లేదు.
అందుకే ఇప్పుడు వెంకటేష్ తో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమాలో కావలసినంత సెంటిమెంట్ సీన్స్ ఉండటమే కాకుండా భారీ యాక్షన్ ఎలిమెంట్స్ ని కూడా జోడించి ఈ సినిమాని భారీ లెవెల్లో తెరకెక్కించాలనే ప్రయత్నంలో త్రివిక్రమైతే ఉన్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాను తీసి సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చిన త్రివిక్రమ్…వీళ్ళ మధ్య గ్యాప్ వచ్చిందా..?