ఐపీఎల్: పంజాబ్ vs ముంబై.. గెలుపెవరిది?

ముందుగా మురిస్తే పండుగ కాదన్న సామెత పంజాబ్ కు అక్షరాల సూట్ అవుతుంది. తొలి మ్యాచ్ లోనే భారీ విజయాన్ని అందుకొని ఆ తర్వాత వరుస పరాజయాలతో ఆ జట్టు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. టోర్నమెంట్ మొదటి మ్యాచ్ ను భీకరంగా గెలిచిన పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత మూడు ఘోరమైన పరాజయాలను చవిచూసింది. చెన్నైలోని స్పిన్ కు సహకరించే గమ్మత్తైన పిచ్ లో వారు ఆడలేకపోతుండడం జట్టును మరింత కృంగదీస్తోంది. ఈ రాత్రి చెపాక్ స్టేడియంలోనే టోర్నీలోనే […]

Written By: NARESH, Updated On : April 23, 2021 11:07 am
Follow us on

ముందుగా మురిస్తే పండుగ కాదన్న సామెత పంజాబ్ కు అక్షరాల సూట్ అవుతుంది. తొలి మ్యాచ్ లోనే భారీ విజయాన్ని అందుకొని ఆ తర్వాత వరుస పరాజయాలతో ఆ జట్టు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. టోర్నమెంట్ మొదటి మ్యాచ్ ను భీకరంగా గెలిచిన పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత మూడు ఘోరమైన పరాజయాలను చవిచూసింది. చెన్నైలోని స్పిన్ కు సహకరించే గమ్మత్తైన పిచ్ లో వారు ఆడలేకపోతుండడం జట్టును మరింత కృంగదీస్తోంది. ఈ రాత్రి చెపాక్ స్టేడియంలోనే టోర్నీలోనే బలమైన ముంబై ఇండియన్స్ ను పంజాబ్ ఎదుర్కోనున్నారు. రెండు విజయాలు మరియు రెండు ఓటములతో ముంబై కూడా టోర్నమెంట్‌లో అస్థిరమైన ఆరంభంతో ముందుకు సాగుతోంది. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని జట్టుతో పోల్చినప్పుడు ముంబై చాలా సమతుల్యతతో బలంగా కనిపిస్తోంది.

-చెన్నై పిచ్ పంజాబ్ బ్యాట్స్ మెన్లకు పెద్ద పరీక్షగా మారిందా?
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడిన చివరి మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయలేకపోయారు. షారుఖ్ ఖాన్ తప్ప మరే ఇతర బ్యాట్స్ మన్ పిచ్ మీద నిలబడలేకపోయారు. పరుగులు చేయలేకపోయారు. మరోసారి జట్టు భీకర ఓపెనర్లు అయిన కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌పై ఆధారపడి ఉంటుంది. క్రిస్ గేల్ , నికోలస్ పూరన్ అస్థిరత ఆందోళన కొనసాగుతోంది. వారు ఏమాత్రం భారీ స్కోర్లు చేయలేకపోతున్నారు. ఇక బౌలింగ్ కింగ్ మహ్మద్ షమీ ఫామ్‌లో లేకపోవడంతో బౌలింగ్ కూడా బలహీనంగా కనిపిస్తోంది. ఈ స్పిన్ పిచ్ లో స్పిన్నర్ మురుగన్ అశ్విన్ బాగా రాణించాలని టీం మేనేజ్ మెంట్ కోరుకుంటోంది.

-ముంబై బ్యాట్స్ మెన్ రాణిస్తారా?
ముంబై బ్యాట్స్ మెన్ కూడా చెన్నై పిచ్ లో పరుగులు చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా, క్వింటన్ డి కాక్ మరియు ఇషాన్ కిషన్ వంటివారు ఇంకా మెరుగైన ప్రదర్శన ఇవ్వడం లేదు. బౌలింగ్ అయితే సూపర్ గా ఉంది. కీలకమైన మిడిల్ ఓవర్లలో పంజాబ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టడానికి రాహుల్ చాహర్, కృనాల్ పాండ్యా, జయంత్ యాదవ్ లను ఎక్కువగా ఉపయోగించుకోవడంలో కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాలు సిద్ధం చేశాడు.

ఐపీఎల్ చరిత్ర: ఈ రెండు టీంలు ఒకరితో ఒకరు పోటీపడిన 26 మ్యాచ్‌లలో ముంబై 14 మ్యాచ్ లను, పంజాబ్ 12 విజయాలను సాధించింది.

మ్యాచ్ వేదిక: చిదంబరం స్టేడియం, చెన్నై.

మ్యాచ్ సమయం: రాత్రి 07.30 PM