
సీరం సంస్థ తాను సరఫరా చేసే కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేలు ఆసుపత్రులకు వేర్వేరుగా నిర్ధారించడాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తప్పుపట్టారు. ఒకే సంస్థ తయారుచేసిన ఒక వ్యాక్సిన్ ధర మూడు రకాలుగా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని ఎలా అనుమతించారో అర్ధం కాని పరిస్థితి నెలకొందని పేర్కొంటూ ఆమె గురువారం ప్రధానమంద్రి నరేంద్ర మోదీకి రెండు పేజీల లేఖ రాశారు.