IPL 2025 Postponed: ఇటీవల ధర్మశాల వేదికగా పంజాబ్- ఢిల్లీ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్థంతరంగా ఆగిపోయింది. ఇక అప్పటినుంచి ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించలేదు. వారం పాటు ఐపీఎల్ టోర్నీని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఇప్పుడు రెండు దేశాలు ఫైరింగ్ ఆపడానికి ఒకే చెప్పడంతో.. తదుపరి ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించడానికి బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం బీసీసీఐ పెద్దలు కేంద్ర కార్యాలయంలో భేటీ కానున్నారు. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి..”ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18 ఎడిషన్ గ్రూప్ దశ ముగింపు వరకు వచ్చింది. త్వరలో ప్లే ఆఫ్ దశ మ్యాచ్ లు మొదలవుతాయి. అయితే అనుకోని అవాంతరం తలెత్తడంతో ఒక్కసారిగా ఐపీఎల్ వాయిదా పడింది. బహుశా ఒకటి లేదా రెండు రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్లు మళ్లీ మొదలు కావచ్చు. ఆదివారం బీసీసీఐ పెద్దలు భేటీ అవుతున్నారు. మ్యాచ్ల నిర్వహణపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోబోతున్నారని” జాతీయ మీడియా తను ప్రసారం చేసిన కథనాలలో పేర్కొంది.
Also Read: ట్రంప్ మధ్యవర్తిత్వం సరే.. ఆపరేషన్ సింధూర్ నుంచి భారత్ ఏం తెలుసుకోవాలి?
దక్షిణభారతంలోనే..
పాకిస్తాన్ బార్డర్ గా ఉన్న ఏరియాలలో ఇప్పటికీ టెన్షన్ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో దక్షిణ భారతంలోని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలలో మ్యాచులు నిర్వహించడానికి బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. బీసీసీఐ పెద్దలు కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా చెప్పారు. మొత్తంగా చూస్తే మిగిలిన 11 మ్యాచులు ఇక్కడే నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. పైగా ఇక్కడ శాంతిభద్రతలు పర్యవేక్షించడం అత్యంత సులభం. ఆటగాళ్లకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. ఇటీవల జరిగిన మ్యాచ్లకు ఇక్కడి ప్రభుత్వాలు భద్రత కల్పించాయి.. అభిమానులు కూడా భారీగా వస్తుంటారు. హోటళ్లు, ఇతర సదుపాయాలు కూడా ఇక్కడ మెండుగానే ఉంటాయి.. ఇక్కడి వాతావరణాన్ని ఆటగాళ్లు కూడా అమితంగా ఆస్వాదిస్తూ ఉంటారు.. గతంలో ఇక్కడ ఆడిన అనుభవం చాలామంది ప్లేయర్లకు ఉన్నది.. అందువల్లే వారు ఇక్కడ ఆడేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు” దక్షిణ భారతంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయి. పైగా ఈ ప్రాంతాలు పాకిస్తాన్ దేశానికి చాలా దూరంలో ఉంటాయి. ఇక్కడ మైదానాలు కూడా చాలా విశాలమైనది. ప్రేక్షకులకు, అభిమానులకు అమితమైన క్రికెట్ ఆనందాన్ని అందించడానికి ఈ మైదానాలు సిద్ధంగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఇక్కడ అద్భుతమైన క్రికెట్ ఆడవచ్చు. ఆటగాళ్లకి కూడా అద్భుతమైన సౌకర్యాలు కల్పించవచ్చు. భద్రత పరంగా కూడా ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సహకారాన్ని అందిస్తుంటాయి. గతంలో జరిగిన మ్యాచులు కూడా ఇదే విషయాన్ని నిరూపించాయి. ఒకవేళ బీసీసీఐ పెద్దలు ఐపీఎల్ నిర్వహించాలి అనుకుంటే దక్షిణ భారతదేశంలోని చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాలు బెస్ట్ చాయిస్ అని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.