IPL Playoffs 2025: సపరించిన జాబితా ప్రకారం మే 29 నుంచి ప్లే ఆఫ్ షురూ అవుతాయి. జూన్ 3న చివరి పోటీ ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈసారి ఛాంపియన్ ఎవరనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. పోటీలు కూడా ఉత్కంఠ గా సాగే అవకాశం కనిపిస్తోంది.. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ ఏకపక్ష విజయాన్ని దక్కించుకుంది. గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ పూర్తిగా తలవంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లు లాస్ అయి 199 రన్స్ స్కోర్ చేసింది. 199 స్కోర్ ను గుజరాత్ జస్ట్ అలా సింపుల్గా తీసి అవతలపడేసింది. జస్ట్ ఒక వికెట్ కూడా లాస్ కాకుండా 19 ఓవర్లలో 205 రన్స్ చేసి ఢిల్లీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఢిల్లీ , గుజరాత్ జట్టు ప్లేయర్లు సెంచరీలు చేయడం విశేషం.
Also Read: నిరుడు ఛాంపియన్..ఈ ఏడు గ్రూప్ దశలోనే.. పాపం కోల్ కతా
ఢిల్లీ తరఫున కేఎల్ రాహుల్ 112 రన్స్ స్కోర్ చేసి నాటౌట్ గా నిలిస్తే.. గుజరాత్ జట్టులో సాయి సుదర్శన్ 108 రన్స్ చేసి చివరి వరకు నిలబడ్డాడు. సాయి మాత్రం బీభత్సంగా ఇన్నింగ్స్ ఆడాడు. 61 బాల్స్ ఫేజ్ చేసి నాలుగు వీరలెవెల్ సిక్సర్లు కొట్టాడు. డజన్ ఫోర్ లతో దుమ్ము దులిపాడు.. అతడి బ్యాటింగ్ దూకుడుకు ఢిల్లీ జట్టులో ఏ బౌలర్ కూడా ముకుతాడు వేయలేకపోయాడు. సాయి సుదర్శన్ ఈ సీజన్లో తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పటివరకు 12 మ్యాచ్లలో అతడు 617 పరుగులు చేసేసాడు. అయితే ఇందులో అతడు ఒక శతకం.. ఆరు అర్థ శతకాలు కొట్టాడు.. లీగ్ స్టేజిలో ఇంకా రెండు మ్యాచ్లు.. నాకౌట్స్ పెండింగ్ ఉన్న నేపథ్యంలో… సాయి దూకుడుగా బ్యాటింగ్ చేయడం సర్వసాధారణంగా కనిపిస్తోంది. అతడి యావరేజ్ ఏకంగా 56.09 ఉండడం విశేషం. స్ట్రైక్ రేట్ కూడా 157 ఉండడం విశేషం..గిల్ కూడా వీర లెవెల్ లో బ్యాటింగ్ చేశాడు. 53 బాల్స్ ఫేజ్ చేసి ఏడు సిక్సర్లు.. మూడు ఫోర్లు కొట్టి 93 రన్స్ స్కోర్ చేశాడు. వీరిద్దరి దుమ్ము దుమారం ముందు ఢిల్లీ జట్టు బౌలర్లు జస్ట్ ఆడియన్స్ గా మిగిలిపోయారు. అద్భుతంగా బౌలింగ్ వేసే అక్షర్ పటేల్.. వైవిధ్యంగా బంతులు వేసే నటరాజన్.. మెరుపు బంతులు సంధించే చమీరా 11 కు పైగా ఎకానమీ నమోదు చేశారంటే.. వారి బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గుజరాత్ కంటే ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కూడా సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. రన్స్ అదే పనిగా వచ్చేశాయి. రాహుల్ అయితే ఏకంగా 1 1 2 స్కోర్ చేశాడు. అభిషేక్ పోరెల్ 30 పరుగులు చేసినా.. ఉన్నంతసేపు అదరగొట్టాడు. అక్షర్ పటేల్ 25.. స్టబ్స్ 21 పరుగులు చేసి ఢిల్లీ ఇన్నింగ్స్ లో తమ వంతు పాత్ర పోషించారు.. ఢిల్లీ జట్టు సాధించిన గ్రాండ్ విక్టరీ వల్ల ఒకేసారి మూడు టీంలు ప్లే ఆఫ్ వెళ్లిపోయినట్టే. ఢిల్లీ పై సాధించిన విజయం ద్వారా పాయింట్ల పట్టికలో గుజరాత్ టాప్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. సెకండ్ ప్లేస్ లో బెంగళూరు ఉంది. థర్డ్ ప్లేస్ లో పంజాబ్ ఉంది. ఆల్మోస్ట్ ఈ మూడు జట్లు ప్లే ఆఫ్ వెళ్లినట్టే. ఇక ఒక్క స్థానం కోసం ముంబై, ఢిల్లీ మధ్య టఫ్ ఫైట్ ఉంది. ముంబై జట్టు తన నెక్స్ట్ మ్యాచ్ ఢిల్లీ తో ఆడుతుంది. ఈనెల 23న ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. 26న పంజాబ్ తో ముంబై తలపడుతుంది. ఈ రెండు మ్యాచ్లలో ముంబై ఓడిపోతే ఢిల్లీకి లైన్ క్లియర్ అవుతుంది.. ఇక ఇప్పటికే కోల్ కతా, లక్నో, హైదరాబాద్ , రాజస్థాన్, చెన్నై ఇంటికి వెళ్ళిపోయాయి.