RCB Vs KKR IPL 2025: గత సీజన్లో విజేతగా నిలవడం.. ఈ సీజన్లో అద్భుతమైన ఆటగాళ్లు ఉండడంతో.. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఈ ఏడాది కూడా విజేతగా ఆవిర్భవిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అభిమానుల అంచనాలను కోల్ కతా ప్లేయర్లు ఏ దశలోనూ నిలుపుకోవడానికి ప్రయత్నించలేదు. పైగా వారు తమ స్థాయికి తగ్గట్టుగా ఆట తీరు ప్రదర్శించలేదు. దీంతో కోల్ కతా జట్టు ఈసారి గ్రూప్ దశ నుంచే ఇంటికి వెళ్లిపోయింది. కీలకమైన మ్యాచ్ వర్షం వల్ల రద్దుకావడంతో.. కోల్ కతా అధికారికంగానే ప్లే ఆఫ్ నుంచి తప్పుకుంది. దృశ్యం ఇచ్చే ఇంటికి వెళ్లిపోయింది..కోల్ కతా తప్పక గెలవాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించింది. కోల్ కతా 13 మ్యాచ్ లలో ప్రత్యర్థులతో తలపడింది… 5 విక్టరీలు మాత్రమే సాధించింది. 12 పాయింట్లు మాత్రమే సాధించింది. రెండు మ్యాచ్లు వర్షం వల్ల రద్దు కావడంతో కోల్ కతా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరోవైపు గత సీజన్లో రన్నర్ అప్ హైదరాబాద్ జట్టు కూడా ఈసారి దారుణంగా నిరాశపరిచింది. 11 మ్యాచులు ఆడి కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించి.. గ్రూప్ దశ నుంచి ఇంటికి వెళ్లిపోయింది.
Also Read: బీజేపీని వదిలేసి జగన్ తప్పు చేశాడా?
విపరీతమైన వర్షం
చాలా రోజుల గ్యాప్ తర్వాత ఐపీఎల్ మళ్ళీ మొదలు కావడంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో విపరీతమైన సందడి నెలకొంది. అభిమానులు భారీగా స్టేడియానికి చేరుకున్నారు. అయితే వారి ఆశలపై వర్షం నీళ్ళు చల్లింది. కుండపోతగా వర్షం కురవడంతో మ్యాచ్ రద్దయింది. దీంతో రెండు చెట్లకు చెరొక పాయింట్ లభించింది. కోల్ కతా 13 మ్యాచ్ లలో ప్రత్యర్థులతో తలపడింది… 5 విక్టరీలు మాత్రమే సాధించింది. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. మరోవైపు బెంగుళూరు 17 పాయింట్లు ఫస్ట్ ప్లేస్ చేరుకుంది. ఇక మరో రెండు మ్యాచ్లు బెంగళూరు ఆడాల్సి ఉంది. ఇందులో ఏ ఒక్క దాంట్లో విజయం సాధించినా ప్లే ఆఫ్ వెళ్తుంది. ఏ రకంగా చూసుకున్నా కూడా బెంగళూరు ప్లే ఆఫ్ వెళ్లడం లాంచనమే. అయితే ఈసారి బెంగళూరు ప్లేయర్లు ప్రారంభం నుంచి పకడ్బందీగా ఆడుతున్నారు. కీలకమైన మ్యాచులలో సత్తా చాటారు. బౌలింగ్ విభాగంలో పటిష్టంగా ఉన్నారు. బ్యాటింగ్ విభాగంలో సత్తా చూపిస్తున్నారు. అందువల్లే తమ జట్టును ఈసారి ప్లే ఆఫ్ దాకా తీసుకెళ్లారు. ఒకవేళ అన్ని అనుకున్నట్టు జరిగితే బెంగళూరు విజేతగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరో వైపు బెంగళూరు జట్టుకు అభిమానులు బలమైన సపోర్ట్ ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఈ సాలా కప్ నమదే అంటూ నినాదాలు చేస్తున్నారు.