IPL Mega Auction 2025: ఈ ఐపీఎల్ వేలంలో వైభవ్ సూర్య వంశీ అనే 13 సంవత్సరాల బాలుడు 1.10 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాడు. అతడిని రాజస్థాన్ జట్టు పోటాపోటీ మధ్య దక్కించుకుంది. కానీ అతడి వయసుకంటే రెట్టింపు వయసున్న ఆటగాళ్లు.. అంతకుమించి అనుభవం ఉన్న ఆటగాళ్లు.. ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదు. అలాగని వారేమీ అనామక ఆటగాళ్లు కాదు. రంజి నుంచి మొదలు పెడితే ఐపిఎల్ వరకు అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడి ఆకట్టుకున్నారు. అలాంటి ఆటగాళ్లు మొన్న జరిగిన ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోకపోవడం సంచలనం కలిగించింది. గత ఐపీఎల్ వేలంలో వారు కళ్ళు చెదిరే ధర పలికారు. అయితే ఈసారి మాత్రం అమ్ముడుపోలేదు. కొందరికి అయితే అతి తక్కువ ధర లభించింది. ఉదాహరణకు మిచెల్ అనే ఆటగాడు 2024 లో జరిగిన మినీ వేలంలో 14 కోట్లకు అమ్ముడుపోయాడు. అల్జరీ జోసెఫ్ అనే ఆటగాడు 11.50 కోట్లకు, రూసో 8 కోట్లకు, పృథ్వీ షా 7.5 కోట్లకు అమ్ముడు పోయారు. కానీ ఈసారి ఈ ఆటగాళ్లను ఎవరూ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. కనీసం వారి వైపు కూడా చూడలేదు. వారు తమ బేస్ ప్రైస్ 30 లక్షలకు తగ్గించుకున్నా ఎవరూ దేక లేదు.. ఇక వీరి పరిస్థితి ఇలా ఉంటే.. మరికొందరి ఆటగాళ్ల దుస్థితి మరో విధంగా ఉంది. సమీర్ రిజ్వీ అనే ఆటగాడు గత సీజన్లో 8.40 కోట్లు దక్కించుకున్నాడు. ఈసారి 95 లక్షలకే అమ్ముడుపోయాడు. కరణ్ 18.5 కోట్లకు అమ్ముడు పోగా.. ఈసారి 2.40 కోట్లకే పరిమితమయ్యాడు. స్టార్క్ 24.75 కోట్లకు అమ్ముడుపోగా.. ఈసారి 11.75 కోట్లకే పడిపోయాడు.
ఆశించినంత స్థాయిలో..
ఈ ఆటగాళ్లు గత సీజన్లో భారీ ధరకు అమ్ముడుపోయినప్పటికీ.. ఫ్రాంచైజీలు ఊహించినంతస్థాయిలో ప్రదర్శన చేయలేదు. అందువల్లే ఆ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదిలించుకున్నాయి. కోట్లకు కోట్లు ఇచ్చుకోవడం ఎందుకు? వారు ప్రదర్శన చేయనప్పుడు తలలు పట్టుకోవడం ఎందుకు? అనే సూత్రాన్ని యాజమాన్యాలు ఈసారి నూటికి నూరు శాతం పాటించాయి. అందువల్లే పై ఆటగాళ్లను యాజమాన్యాలు తీసుకోలేదు. కొంతమందికి భారీగా ధర చెల్లించినప్పటికీ.. వారు ఊహించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోవడంతో యాజమాన్యాలు ఫీజు తగ్గించాయి. అందువల్లే గత సీజన్లో మెరుపులు మెరిపించిన ఆటగాళ్లు.. ఈసారి పూర్తిగా విఫలమయ్యారు. అటు ధరను ఆశించినంత స్థాయిలో దక్కించుకోక.. తలవంచుకున్నారు. ఏదో వేలంలో ఉన్నాం కాబట్టి.. కొనుగోలు చేశారనే స్థాయికి దిగజారి పోయారు. అయితే ఈ సీజన్లో తక్కువ ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు.. తమ ఆట తీరును గనుక మెరుగుపరచుకుంటే.. వచ్చే మినీ వేలంలో ధర ను పెంచుకునే అవకాశం ఉంది. “ఆటగాళ్లు భారీ ధర వచ్చిన తర్వాత ఆట తీరు మీద దృష్టి సారించడం లేదు. అది అంతిమంగా వారి కెరియర్ మీద ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికైనా తమ లోపాలను గుర్తించి.. వాటిని మెరుగుపరుచుకుంటే ఇబ్బంది ఉండదని” క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.