Chinnaswamy Stadium: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ విజేతగా నిలిచిన తర్వాత బెంగళూరు జట్టు చిన్నస్వామి స్టేడియంలో విజయ్ పరేడ్ నిర్వహించిన విషయం తెలిసిందే.. అయితే ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జాగ్రత్తలు పాటించకపోవడంతో తొక్కి సలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చాలామంది బెంగళూరు అభిమానులు కన్నుమూశారు. అంతకుమించిన సంఖ్యలో అభిమానులు గాయపడ్డారు.
ఈ ఘటన నేపథ్యంలో చిన్న స్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహిస్తారా? అనే ప్రశ్న అందరిలోనూ వ్యక్తం అయింది. ఈ నేపథ్యంలో చిన్న స్వామి స్టేడియంలో వచ్చే ఐపిఎల్ సీజన్ లో మ్యాచ్ లు నిర్వహించే అవకాశం లేదని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిని బలపరుస్తూ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో కర్ణాటక క్రికెట్ సంఘానికి చెందిన కొంతమందిని, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చెందిన కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో చాలామంది చిన్నస్వామి స్టేడియంలో వచ్చే ఐపిఎల్ సీజన్ లో మ్యాచ్ లు నిర్వహించే అవకాశం లేదని ఒక అంచనాకు వచ్చారు.
ఇలాంటి వార్తలు సాగుతున్న నేపథ్యంలో చిన్న స్వామి స్టేర్యంలో మళ్ళీ ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించడానికి మార్గం సుగమం అయిందని తెరుస్తోంది. జస్టిస్ కున్హ కమిషన్ భద్రత సిఫారసులను సూచించిందని.. వాటిని అమలు చేస్తేనే మ్యాచ్ లు నిర్వహించడానికి పచ్చ జెండా ఉపాలని కర్ణాటక క్యాబినెట్ తీర్మానించినట్టు తెలుస్తోంది. తొక్కిసలాట ఘటన తర్వాత స్టేడియం భద్రతాపరంగా అత్యంత అనుకూలం కాదని జస్టిస్ కున్హా కమిషన్ నివేదిక ఇచ్చింది. దీంతో పెద్ద పెద్ద ఈవెంట్లు మొత్తం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ స్టేడియంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు ఇతర ప్రాంతాల్లో జరపాలసి వచ్చింది. ఇక ప్రస్తుతం స్టేడియాన్ని పునరుద్ధరించే పనులు మొదలుపెట్టారు.. ఈ పనులను ఐపీఎల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
స్టేడియంలో భద్రతపరంగా చర్యలు కూడా మొదలుపెట్టారు. సీట్లను కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు.. గ్యాలరీ కూడా విశాలంగా రూపొందిస్తున్నారు.. స్టేడియం చుట్టూ పటిష్టమైన కంచె నిర్మిస్తున్నారు. ఇరుకుగా ఉన్న మార్గాన్ని విశాలంగా మారుస్తున్నారు. పార్కింగ్ ప్రదేశాలను కూడా మరింతగా ఆధునికరిస్తున్నారు.. వచ్చే ఐపిఎల్ నాటికి చిన్నస్వామి స్టేడియం సరికొత్త రూపు దాల్చుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.