https://oktelugu.com/

IPL Full Schedule 2024: ఐపీఎల్ ఫుల్‌ షెడ్యూల్‌ రిలీజ్‌.. తెలుగు రాష్ట్రాల్లో మ్యాచ్‌లు ఇవే..

టోర్నీ ప్రారంభానికి ముందు బీసీసీఐ కేవలం 21 మ్యాచ్‌లకు మాత్రమే షెడ్యూల్ ప్రకటించింది. మిగతా 53 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను పెండింగ్‌లో పెట్టింది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మిగతా మ్యాచ్‌లో విదేశాల్లో జరుగతాయన్న ప్రచారం జరిగింది.

Written By: , Updated On : March 26, 2024 / 08:41 AM IST
IPL Full Schedule 2024

IPL Full Schedule 2024

Follow us on

IPL Full Schedule 2024: ఐపీఎల్‌ సీజన్‌ -17 పూర్తి షెడ్యూల్‌ ప్రకటించకపోవడంతో క్రికెట్‌ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. టోర్నీ ప్రారంభమైన మూడు రోజుల తర్వాత బీసీసీఐ ఉత్కంఠకు తెరదించుతూ మార్చి 25న పూర్తి షెడ్యూల్‌ విడుదల చేసింది. సిరీస్‌లో మ్యాచ్‌లన్నీ దేశంలోనే జరుగనున్నాయి. మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయని ప్రకటించింది.

మొదట 21 మ్యచ్‌లకే షెడ్యూల్‌..
టోర్నీ ప్రారంభానికి ముందు బీసీసీఐ కేవలం 21 మ్యాచ్‌లకు మాత్రమే షెడ్యూల్ ప్రకటించింది. మిగతా 53 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను పెండింగ్‌లో పెట్టింది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మిగతా మ్యాచ్‌లో విదేశాల్లో జరుగతాయన్న ప్రచారం జరిగింది. అయితే అనుమానాలను నివృత్తి చేస్తూ బీసీసీఐ తాజాగా పూర్తి షెడ్యూల్‌ ప్రకటించింది. సీజన్ మొత్తం భారత్‌లోనే జరుగుతుందని క్లారిటీ కూడా ఇచ్చింది.

మే 26 వరకు మ్యాచ్‌లు..
ఐపీఎల్‌ సీజన్‌ – 17 మార్చి 22న ప్రారంభమైంది. మే 26 వరకు టోర్నీ జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. మే 26న చెన్నై వేదికగా ఫైనల్ జరగనుంది. మే 24న జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌కు కూడా చెన్నై చిదంబరం స్టేడియమే అతిథ్యం ఇవ్వనుంది. ఇక గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా మే 21, 22వ తేదీల్లో క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి విడత షెడూ‍్యల్‌ ఏప్రిల్‌ 7 వరకు ప్రకటించగా, ఏప్రిల్‌ 8 నుంచి రెండో విడత షెడ్యూల్‌ ప్రారంభమవుతాయి. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు ఏప్రిల్ 8న చెన్నై వేదికగా తలపడతాయి. ఇక లీగ్ దశలో చివరి మ్యాచ్‌ మే 19న జరుగుతుంది. లీగ్‌లో చివరి మ్యాచ్‌ రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంద.

తెలుగు రాష్ట్రాల్లో జరిగే మ్యాచ్‌లు ఇవే..
ఐపీఎల్‌ సీజన్‌ -17లో తెలుగు రాష్ట్రాల క్రికెట్‌ అభిమానులకు ఫుల్ మజా అందనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ గతంలో మాదిరిగానే హోంగ్రౌండ్ మ్యాచ్‌లన్నీ ఉప్పల్‌ సే‍్టడియంలోనే జరుతాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈసారి తొలి విడత షెడ్యూల్‌లో తమ హోంగ్రౌండ్‌గా వైజాగ్‌ను ఎంచుకుంది. దీంతో వైజాగ్‌లో ఢిల్లీ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. హైదరాబాద్‌లో మార్చి 27న, ఏప్రిల్ 5న, ఏప్రిల్ 25న, మే 2న, మే 8న, మే 16న, మే 19న మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ తేదీల్లో ఎస్‌ఆర్‌హెచ్‌ ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్, లక్నో సూపర్‌జెయింట్స్, గుజరాత్ టైటాన్స్‌, పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌ జట్లతో తలపడుతుంది. మొత్తంగా హైదరాబాద్‌లో 7 మ్యాచ్‌లు జరగనున్నాయి. వైజాగ్‌లో మార్చి 31న, ఏప్రిల్ 3న రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆయా తేదీల్లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 9 మ్యాచ్‌లు జరగనున్నాయి.