Chain Snatching: రీల్స్ చేస్తుంటే చైన్ స్నాచింగ్.. వీడియో వైరల్

ఉత్తర ప్రదేశ్ లోని ఓ మహిళకు కూడా ఇలాగే రీల్స్ చేయడం అంటే చాలా ఇష్టం. కాకపోతే ఆమె భిన్నమైన కాన్సెప్ట్ లు ఎంచుకుంటుంది. ఒక చిత్రమైన రీల్ చేయాలని భావించి ఒక కెమెరామెన్ ఏర్పాటు చేసుకుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : March 26, 2024 9:10 am

Chain Snatching

Follow us on

Chain Snatching: సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత చాలామంది రీల్స్ చేస్తున్నారు. అప్పట్లో టిక్ టాక్ ఉన్నప్పుడు చాలామంది అందులో వీడియోలు పోస్ట్ చేసేవారు.. కానీ ఎప్పుడైతే అది నిషేధానికి గురైందో.. అప్పటినుంచి జనాలు రీల్స్ కు అలవాటు పడ్డారు..ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్.. వంటి సామాజిక అనుసంధాన వేదికలు రీల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పించడంతో.. చాలామంది కొత్త కొత్త ఐడియాలతో రీల్స్ చేస్తున్నారు. ఈ రీల్స్ ద్వారా ఫేమస్ అయిన వారు.. వివిధ రంగాలలో అవకాశాలు పొందిన వారు చాలామంది ఉన్నారు. అందుకే యువత నుంచి వృద్దుల వరకు రీల్స్ చేయడం అంటే చెవి కోసుకుంటున్నారు.

ఉత్తర ప్రదేశ్ లోని ఓ మహిళకు కూడా ఇలాగే రీల్స్ చేయడం అంటే చాలా ఇష్టం. కాకపోతే ఆమె భిన్నమైన కాన్సెప్ట్ లు ఎంచుకుంటుంది. ఒక చిత్రమైన రీల్ చేయాలని భావించి ఒక కెమెరామెన్ ఏర్పాటు చేసుకుంది. అలా రీల్ చేస్తుండగా హెల్మెట్ ధరించి చిత్ర హెల్మెట్ ధరించిన ఒక యువకుడు ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చాడు. అంతే ఆ మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసులో లాక్కెళ్ళాడు. ఏం జరుగుతుందో తెలిసే లేదా అప్పటికే అతడు గొలుసు తస్కరించి వెళ్లిపోయాడు. దీంతో ఒక్కసారిగా ఆ మహిళ షాక్ కు గురైంది. వెంటనే తీరుకొని అరుస్తుండగా ఆ చైన్ స్నాచర్ వెళ్ళిపోయాడు.

మెడలో ఉన్న గొలుసు చోరీకి గురికాగానే ఆ మహిళ లబోదిబో మంటూ ఏడవడం మొదలు పెట్టింది. ఈ తతంగం మొత్తం ఆ కెమెరాలో రికార్డయింది.. దీంతో బాధిత మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమె చెప్పిన వివరాలు ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. “బాధితురాలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్ రికార్డులు పరిశీలించాం. బైక్ నెంబర్ ఆధారంగా నిందితుడిని పట్టుకుంటాం. రీల్స్ చేసేటప్పుడు మహిళలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండాలని” ఇందిరాపురం ఏసిపి స్వతంత్ర కుమార్ సింగ్ తెలిపారు. కాగా ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ నగరంలోని ఇందిరాపురంలో జరిగింది.