https://oktelugu.com/

Anchor Suma: రోడ్డుమీద టమాటాలు, కోడిగుడ్లు ఏరుకుంటున్న యాంకర్ సుమ.. ఏమైందో పాపం?

సుమకు లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే కాదు.. జెంట్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఖమ్మంలో ఓ వృద్ధాశ్రమానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా అందించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 26, 2024 / 08:34 AM IST

    Anchor Suma

    Follow us on

    Anchor Suma: ఆమె పుట్టింది కేరళలో.. తెలుగు అద్భుతంగా మాట్లాడుతుంది. అలా మాట్లాడుతుంది కాబట్టే తెలుగులో దశాబ్దాల నుంచి నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతోంది. ఈటీవీలో వచ్చే ప్రత్యేక కార్యక్రమాల నుంచి మొదలు పెడితే ప్రీ రిలీఫ్ ఫంక్షన్లు, మూవీ ప్రమోషన్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో. కనీసం గాలి పీల్చుకోవడానికైనా ఖాళీ ఉంటుందో లేదో.. అలా ఉంటుంది సుమ డైరీ. తెలుగులో ఎంతోమంది యాంకర్లు వచ్చారు, వస్తూనే ఉన్నారు, ఎంతోమంది పోతూనే ఉన్నారు. కానీ సుమ స్థానం మాత్రం ప్రత్యేకం. ఎక్కడ మాట తడబడదు. స్పాంటేనిటీ కోల్పోదు. హ్యూమర్ మిస్ కానివ్వదు. అందుకే సుమను చాలామంది ఇష్టపడుతుంటారు.

    సుమకు లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే కాదు.. జెంట్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఖమ్మంలో ఓ వృద్ధాశ్రమానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా అందించింది. అవకాశం కుదిరినప్పుడల్లా ఆమె అక్కడికి వస్తుంటుంది. అక్కడి వృద్ధులకు సపర్యలు చేస్తూ ఉంటుంది. ఏనాడూ మీడియా ఎక్స్ పోజ్ కోరుకోదు. పైగా తన వచ్చి వెళ్తున్న విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతుంది. అలాంటి సుమ ఒక్కసారిగా రోడ్డు మీద టమాటలు, గుడ్లు పట్టుకుంటూ కనిపించింది. బకెట్లో నీళ్లతో దర్శనమిచ్చింది..

    సాధారణంగా హోలీ సందర్భంగా చాలామంది టమాటాలు విసురుకుంటారు. తలమీద గుడ్లు పగలగొట్టుకుంటారు. ఆ తర్వాత నీళ్లు చల్లుకుంటారు. కానీ ఇది కానీ ఇది దొరక్క ఇబ్బంది పడేవారు చాలామంది. బెంగళూరులో బకెట్ నీళ్ల కోసం అక్కడి ప్రజలు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. సీజన్లో ధర పెరగడంతో చాలామంది టమాటాలు కొనుగోలు చేసేందుకు వెనుకాడతారు. ఇక ధర పెరిగినప్పుడు గుడ్లను కొనుగోలు చేయాలంటే పేదలు వెనుకా ముందు చూస్తారు. అయితే వీటి అవసరాన్ని సీరియస్ గా చెప్తే ఎవరికీ ఎక్కదు. అందుకే సుమ తన స్టైల్లో హ్యూమర్ మిక్స్ చేసింది.

    ముందుగా రంగు పూసుకున్న యువతి లాగా అవతారం ఎత్తి ఒక బిల్డింగ్ పైకెక్కి టమాట విసిరింది. గుడ్డును పగలగొట్టే ప్రయత్నం చేసింది. జగ్గులో నీటిని చల్లింది. ఏమి తెలియని దానిలాగా గోడ వెనక నక్కినక్కి కూర్చుంది. మరో అవతారంలో ఆధునిక యువతి లాగా దర్శనమిచ్చింది. ఒక బుట్టలో టమాటలు, గుడ్లు, బకెట్ నీళ్లతో కనిపించింది. అంతకుముందు రంగు పూసుకున్న యువతి(ఆమె కూడా సుమనే) విసిరిన వస్తువులను తాను ఒడిసి పట్టినట్టు సుమ కనిపించింది. “గుడ్డు బ్రేక్ ఫాస్ట్ కోసం.. టమాట కూర కోసం.. బకెట్ నీళ్ళు స్నానం కోసం” అని చెప్పింది. చివర్లో కృతజ్ఞత కూడా తెలిపింది. ఈ వీడియో చూసిన వాళ్లకు కామెడీ లాగా అనిపించవచ్చు కానీ.. ఇందులో బోలెడంత నీతి ఉంది. హోలీ సందర్భంగా ఇలాంటి వీడియో ద్వారా పలకరించడంతో నెటిజన్లు సుమకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.