IPL Final Ads : ఐపీఎల్ లో కార్పొరేట్ కంపెనీలు తమ ప్రచారాన్ని ఒక రేంజ్ లో చేసుకొంటాయి.. ప్రకటనల కోసం భారీగా ఖర్చు పెడుతుంటాయి. ఈ ప్రకటనలో అన్ని ఆకట్టుకోవు. కొన్ని మాత్రమే వినియోగదారుల మనసును చూరగొంటాయి. అందులో బ్లింక్ ఇట్, డ్యూ రెక్స్ కంపెనీలు రూపొందించిన ప్రకటనలు ఆకట్టుకుంటున్నాయి. ఆ ప్రకటనలలో భారీగా వాక్యాలు లేవు. సుదీర్ఘ వ్యాసాలు లేవు. జస్ట్ రెండంటే రెండు వాక్యాల్లోనే తమ కంపెనీ ప్రచారాన్ని.. ఐపీఎల్ లో పంజాబ్, బెంగళూరు గెలవాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రకటనలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అవి ఎంత బాగున్నాయంటే.. సోషల్ మీడియాలో అటు పంజాబ్, ఇటు బెంగళూరు అభిమానులు వాటిని తమ సోషల్ మీడియా అకౌంట్ లలో పోస్ట్ చేశారు.
Also Read : విరాట్ కోహ్లీ అవుట్.. బెంగళూరు అభిమానుల గుండె పగిలింది
బ్లింక్ ఇట్ సంస్థ బెంగళూరు జట్టుకు ప్రయోజక కర్తగా వ్యవహరిస్తోంది. ఇటీవల కాలంలో బెంగళూరు తరఫున కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టింది. అందులో బెంగళూరు నగరానికి చెందిన విద్యార్థులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ కార్యక్రమానికి స్పాన్సర్ గా బ్లింక్ ఇట్ వ్యవహరించింది. బెంగళూరు జట్టును బ్లింక్ ఇట్ ప్రమోట్ కూడా చేస్తోంది. ఇక ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ” సమ్ డెలివరీస్ ఆర్ వర్త్ ద వెయిట్” అంటూ ఒక ప్రకటన రూపొందించింది. బ్లింక్ ఇట్ ఆన్లైన్ డెలివరీ కంపెనీగా పేరుపొందింది. తను వస్తువులను డెలివరీ చేస్తుంది కాబట్టి.. తన కంపెనీకి ప్రమోషన్ రావాలని ఉద్దేశంతో డెలివరీ అనే పదాన్ని అందులో వాడింది.. కొన్ని డెలివరీలు.. ఎదురుచూసేందుకు అత్యంత అర్హతను కలిగి ఉంటాయనే అర్థం వచ్చేలా బ్లింక్ ఇట్ ఆ ప్రకటన రూపొందించింది.
ఇక ప్రముఖ కంపెనీ డ్యూరెక్స్ కూడా తను తయారు చేసే ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు సరికొత్తగా ప్రకటన రూపొందించింది. డ్యూరెక్స్ కంపెనీ ఎలాంటి ఉత్పత్తులు తయారు చేస్తుందో అందరికీ తెలుసు. తన అవసరాన్ని.. పంజాబ్, బెంగళూరు జట్ల అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. “18 ఇయర్స్, 2 వ****.. వూ విల్ గెట్ లక్కీ టు నైట్” అంటూ ఒక ప్రకటన రూపొందించింది. ఆ ప్రకటన కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నది. డ్యూరెక్స్ కంపెనీ తయారు చేసే ఉత్పత్తులు యువతను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఆ కంపెనీ తయారు చేసే ఉత్పత్తులను యువత ఎక్కువగా వాడుతుందని ఇటీవలి సర్వేలో తేలింది. యువతను దృష్టిలో పెట్టుకుని డ్యూరెక్స్ రూపొందించిన ఆ ప్రకటన సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టిస్తోంది. డ్యూరెక్స్ రూపొందించిన ఆ ప్రకటనను యువత ఎక్కువగా ఇష్టపడుతోంది. ఆ కంపెనీ రూపొందించిన ప్రకటనపై వందలాది మంది యువత తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం విశేషం.