https://oktelugu.com/

ఐపీఎల్: సన్ రైజర్స్ నిలవాలంటే గెలవాల్సిందే?

దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో ఈరోజు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. అయితే. ప్లే ఆఫ్స్‌ రేసులో భాగంగా ఈ మ్యాచ్‌ ఇరు జట్లకూ కీలకం కానుంది. ఇప్పటిదాకా 11 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఏడింట ఓడిపోయి.. నాలుగింటిలో మాత్రమే గెలిచింది. Also Read: ఆస్ట్రేలియా పర్యటనకు జట్లు: మరో వివాదంలో బీసీసీఐ అటు ఢిల్లీ కూడా ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు సాధించి.. నాలుగింటిలో ఓటమి ఎదుర్కొంది. అటు ఢిల్లీకి.. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 27, 2020 / 12:34 PM IST
    Follow us on

    దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో ఈరోజు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. అయితే. ప్లే ఆఫ్స్‌ రేసులో భాగంగా ఈ మ్యాచ్‌ ఇరు జట్లకూ కీలకం కానుంది. ఇప్పటిదాకా 11 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఏడింట ఓడిపోయి.. నాలుగింటిలో మాత్రమే గెలిచింది.

    Also Read: ఆస్ట్రేలియా పర్యటనకు జట్లు: మరో వివాదంలో బీసీసీఐ

    అటు ఢిల్లీ కూడా ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు సాధించి.. నాలుగింటిలో ఓటమి ఎదుర్కొంది. అటు ఢిల్లీకి.. ఇటు హైదరాబాద్‌కు బ్యాటింగ్ మైనస్‌గా మారింది. ఇక ఢిల్లీ జట్టు గత మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ఓడిపోయింది. కాబట్టి ఈ మ్యాచ్‌కు ఫుల్ లెంగ్త్ స్ట్రెంగ్త్‌తో బరిలోకి దిగనుంది.

    అయితే గాయం కారణంగా హైదరాబాద్‌ జట్టులోని కీలక బ్యాట్స్‌మెన్‌ కేన్‌ విలియమ్సన్‌ జట్టుకు దూరం అయ్యాడు. అలాగే మిడిల్ ఆర్డర్ మెరుపులు మెరిపించకపోవడం కూడా మైనస్‌. ఇప్పటిదాకా వార్నర్, బెయిర్‌స్టోలు కూడా చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇక హైదరాబాద్ జట్టుకు బౌలర్లే బలం. సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, రషీద్ ఖాన్, హోల్డర్, నటరాజన్‌తో ఆ జట్టు బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. బ్యాట్స్‌మెన్ కూడా స్థాయికి తగ్గట్టు ఆడితే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఢిల్లీకి గట్టి పోటీ ఇస్తుందని చెప్పాలి.

    Also Read: ఐపీఎల్: ఈ సండే మళ్లీ ఏమైంది?

    అటు ఢిల్లీ పరిస్థితి కూడా అలానే ఉంది. కీలక సమయంలో బ్యాట్స్‌మెన్లు రాణించకపోవడం.. బౌలర్లు పెద్దగా సత్తా చాటలేకపోవడంతో చతికిలపడింది. మరి నేడు జరుగనున్న ఈ మ్యాచ్‌ రెండు జట్లూ ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే ఈ రెండు జట్లకూ ఈ మ్యాచ్‌ డూ ఆర్‌‌ డై లాంటిదే. మరి కొద్ది గంటలు ఆగితే ఈ మ్యాచ్‌ ఫలాలు తేలనున్నాయి. ఏ జట్టు ప్లేఆఫ్స్‌ ఆశలు నిలుపుకుంటుంది..? ఏ జట్టు తిరిగి ఇంటికి చేరుతుందో చూడాలి.