https://oktelugu.com/

జేడీయూ, బీజేపీల మధ్య పోస్టర్‌ వివాదం..! మిత్రబంధం చెడిందా..?

బీహార్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు తొలి విడత ప్రచారం ఇటీవలే ముగిసింది. బీజేపీతో జేడియూ జతకట్టి ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్‌ సైతం ప్రచారంలోకి దూసుకెళ్తోంది. అయితే ఎన్డీయే కూటమి సీఎం అభ్యర్థిగా నితీశ్‌కుమార్‌ అని ఒప్పందం జరిగినా బీజేపీ మాత్రం కొత్తగా పోస్టర్ల వివాదం తెచ్చింది. ఈ వివాదంతో జేడీయూ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మొదటి విడత ఎన్నికల ప్రచారానికే మిత్రబంధం తెగిపోనుందా..? అనే చర్చ సాగుతోంది. Also Read: అంబానీ vs అమెజాన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 27, 2020 / 12:38 PM IST
    Follow us on

    బీహార్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు తొలి విడత ప్రచారం ఇటీవలే ముగిసింది. బీజేపీతో జేడియూ జతకట్టి ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్‌ సైతం ప్రచారంలోకి దూసుకెళ్తోంది. అయితే ఎన్డీయే కూటమి సీఎం అభ్యర్థిగా నితీశ్‌కుమార్‌ అని ఒప్పందం జరిగినా బీజేపీ మాత్రం కొత్తగా పోస్టర్ల వివాదం తెచ్చింది. ఈ వివాదంతో జేడీయూ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మొదటి విడత ఎన్నికల ప్రచారానికే మిత్రబంధం తెగిపోనుందా..? అనే చర్చ సాగుతోంది.

    Also Read: అంబానీ vs అమెజాన్ అధినేత.. 1.92 లక్షల కోట్లు ఆవిరి

    ఇటీవల జరిగిన బీహార్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేసిన పోస్టర్లలో కేవలం మోదీ ఫొటో మాత్రమే పెట్టారు. జేడియూకు సంబంధించిన ఒక్క నాయకుడి ఫొటో వేయలేదు. అంతేకాకుండా సీఎం అభ్యర్థి అయిన జేడియూ అధినేత నితీశ్‌కుమార్‌ ఫొటో ఎక్కడా కనిపించడం లేదు. దీంతో జేడియూ బీజేపీతో కలిసి పోటీ చేస్తుందా..? లేక ఒంటరిగానే వెళ్తుందా..? అనే అనుమానాలు ప్రజల్లో మొదలయ్యాయి. ఇక మరోవైపు నితీశ్‌కుమార్‌ సైతం ఆయన విడుదల చేస్తున్న ప్రకటనలో కేవలం సొంత పార్టీ నేతల ఫొటోలే వేస్తున్నారు. బీజేపీ నేతల ఫొటోలు వేయడం లేదు. దీంతో ఈ విషయం రచ్చగా మారుతోంది.

    15 ఏళ్లుగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నితీశ్‌కుమార్‌పై జనాల్లో కొంత వ్యతిరేకత ఏర్పడింది. అందుకే ఆయనను సీఎం అభ్యర్థిగా ఫొటో పెట్టి ప్రచారం చేస్తే బీజేపీ సీట్లు తగ్గే అవకాశం ఉందని  స్థానిక బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇదే అదునుగా తాను బీజేపీకి దగ్గరి బంధువని చెప్పుకుంటూ ఎల్‌జేపీ నేత చిరాగ్‌ పాశ్వాన్‌ ప్రచారం చేస్తున్నాడు. దీంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. బీజేపికి ఎవరు మిత్ర పక్షం, ఎవరు పోటీదారు అని తేల్చుకోలేకపోతున్నారు.

    Also Read: జాతీయ న్యూస్ చానెళ్లకు నోటీసులు.. సారీ చెప్పాల్సిందే..

    ఈ తరుణంలో ఆర్జేడీ- కాంగ్రెస్‌ కూటమి పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కొన్ని సంవత్సరాలుగా బీహార్‌లో అభివృద్ధి కుంటుపడిందని, మళ్లీ నితీశ్‌ ముఖ్యమంత్రి అయితే మరింత దిగజారుతుందని ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిపై బీజేపీ నాయకులు మాత్రం ఏ విధంగా స్పందించడం లేదు. దీంతో జేడియూ పరిస్థితి చివరికి ఏమవుతుందోనని చర్చించుకుంటున్నారు.