IPL Discrimination : ఇలాంటి ఉపోద్ఘాతం టీం ఇండియా యువ ఆటగాడు, గుజరాత్ జట్టు వెన్నెముక సాయి సుదర్శన్ కు నూటికి నూరు పాళ్లు సరిపోతుంది . ఇటీవల హార్దిక్ సేనతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో సాయి సుదర్శన్ దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాడు. ఒకవేళ సాయి సుదర్శన్ అవుట్ కాకుండా ఉంటే ఫలితం వేరే విధంగా ఉండేది. వాస్తవానికి జట్టులో ఉన్న కీలక ప్లేయర్లు వెంట వెంటనే ఔట్ అయ్యారు. కానీ సాయి సుదర్శన్ మాత్రం నిలబడ్డాడు. బలమైన ముంబై జట్టును ఇబ్బంది పెట్టాడు. ఒక రకంగా ఓడిపోతారనే పరిస్థితి కల్పించాడు. సాయి సుదర్శన్ క్రీజ్ లో ఉన్నంతవరకు హార్దిక్ తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు. ఇక రోహిత్ అయితే తల బాదుకున్నాడు. లెజెండరీ ప్లేయర్లతో అలా చేయించాడంటే సాయి సుదర్శన్ ఏ స్థాయిలో బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు.
Also Read: మెరుపు స్టంప్ ఔట్ .. ధోనిని గుర్తుచేసిన సంజు శాంసన్..
ఇక ఈ ఐపీఎల్ సీజన్లో సాయి సుదర్శన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఏకంగా 759 రన్స్ చేసి.. నారింజరంగు టోపీ అందుకున్నాడు. వాస్తవానికి సూర్య కుమార్ యాదవ్ చేసిన 717 పరుగుల కంటే, విరాట్ కోహ్లీ చేసిన 657 పరుగుల కంటే.. సాయి సుదర్శన్ చేసిన పరుగులు చాలా ఎక్కువ. వాస్తవానికి సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీకి అంతర్జాతీయ మ్యాచులలో ఆడిన అనుభవం ఉంది. పైగా వారికి సకల సౌకర్యాలు ఉన్నాయి. ఇవేవీ లేకుండానే సాయి సుదర్శన్ అదరగొడుతున్నాడు. మైదానంలో పరుగుల వరద పారిస్తున్నాడు. అయితే ఇంతటి ఘన కీర్తి సాధించినప్పటికీ.. సాయి సుదర్శన్ ఊహించిన పేరు మాత్రం రావడం లేదు అని ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే అతడి స్థానంలో మరో ఆటగాడు కనుక ముఖ్యంగా ఉత్తర భారత దేశానికి చెందిన ఆటగాడు గనుక ఆ స్థాయిలో పరుగులు చేసి ఉంటే మీడియా ప్రచారం వేరే విధంగా ఉండేది. అయితే సాయి సుదర్శన్ దక్షిణాది రాష్ట్రాల చెందిన వ్యక్తి కావడంతో అందువల్లే మీడియా ఎక్కువ ఫోకస్ చేయడం లేదని అతని అభిమానులు ఆరోపిస్తున్నారు..” విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ లేదా సూర్యకుమార్ యాదవ్ లేదా హార్దిక్ పాండ్యా బీభత్సంగా పరుగులు చేస్తే మీడియా ప్రచారం వేరే విధంగా ఉండేది. ఇతర మాధ్యమాలలో వారికి లభించే గౌరవం వేరే విధంగా ఉండేది. కానీ సాయి సుదర్శన్ వారందరినీ దాటుకొని ఈ స్థాయిలో పరుగులు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. క్రికెటర్లకు విద్వత్తు తో పాటు బలమైన నేపథ్యం కూడా ఉండాలేమో.. అప్పుడే వారు మరింత గొప్పగా ప్రచారానికి నోచుకుంటారేమో.. మీడియాలో తెగ నానుతూ ఉంటారేమో.. దక్షిణాది ప్రాంతాల్లో పుట్టిన సాయి సుదర్శన్ ఊహించిన స్థాయిలో గుర్తింపుకు నోచుకోకపోవడం ఇబ్బందికరంగానే ఉంది. అతనికి ఇప్పటికైనా గుర్తింపు ఇచ్చి.. సమర్థవంతమైన స్థానం కల్పించాలని” అతడి అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఐపీఎల్ లో ఈ స్థాయిలో రాణించిన నేపథ్యంలో జాతీయ జట్టులో సాయి సుదర్శన్ కు స్థిరమైన స్థానం కల్పించాలని కోరుతున్నారు.