https://oktelugu.com/

ఐపీఎల్ తేదీ ప్రకటన.. ఫైనల్ ఎక్కడ? ఎప్పుడంటే?

కరోనా కల్లోలంతో భారత్ లో నిర్వహించిన ఐపీఎల్ మధ్యలోనే ఆగిపోయింది. ఎంత కరోనా బయో బబూల్ ఉన్నా కూడా ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు. దీంతో ఐపీఎల్ ను నిరవధికంగా ఆపాల్సి వచ్చింది. ఆగిపోయిన ఐపీఎల్ 14వ సీజన్ ను మళ్లీ పట్టాలెక్కించింది బీసీసీఐ. మిగిలిన 31 మ్యాచ్ లను ఎలాగైనా పూర్తి చేయాలని బీసీసీఐ పట్టుదలగా ఉంది. అయితే ఈ మ్యాచ్ లు ఇండియాలో కాదు.. యూఏఈలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 19 నుంచి […]

Written By:
  • NARESH
  • , Updated On : June 7, 2021 / 06:36 PM IST
    Follow us on

    కరోనా కల్లోలంతో భారత్ లో నిర్వహించిన ఐపీఎల్ మధ్యలోనే ఆగిపోయింది. ఎంత కరోనా బయో బబూల్ ఉన్నా కూడా ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు. దీంతో ఐపీఎల్ ను నిరవధికంగా ఆపాల్సి వచ్చింది.

    ఆగిపోయిన ఐపీఎల్ 14వ సీజన్ ను మళ్లీ పట్టాలెక్కించింది బీసీసీఐ. మిగిలిన 31 మ్యాచ్ లను ఎలాగైనా పూర్తి చేయాలని బీసీసీఐ పట్టుదలగా ఉంది. అయితే ఈ మ్యాచ్ లు ఇండియాలో కాదు.. యూఏఈలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

    సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 10లోపు ఐపీఎల్ ను యూఏఈలో పూర్తి చేయాలని చూస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా బీసీసీఐ దీనిపై ప్రకటన చేసింది. తాజా సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 19న టోర్నీని తిరిగి ప్రారంభించి.. అక్టోబర్ 15న ఫైనల్ తో ముగించాలని భావిస్తున్నట్టు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఈ మేరకు యూఏఈ క్రికెట్ బోర్డు నిర్వామకులు, అధికారులతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు.

    మిగిలిన 31 మ్యాచ్ ల కోసం బీసీసీఐ 25 రోజుల మ్యాచ్ షెడ్యూల్ కావాలని యూఈఇ బోర్డును కోరినట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. ప్రస్తుతం పాయింట్ల ప్రకారం.. ఢిల్లీ మొదటి స్థానంలో చెన్నై 2వ స్థానంలో.. బెంగళూరు, మూడో స్థానంలో, ముంబై 4వ స్థానంలో ఉన్నాయి.