https://oktelugu.com/

షూట్ కి సిద్ధం అవుతోన్న భారీ సినిమాలు !

కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతానికి రోజురోజుకూ కరోనా కేసులు తగ్గుతున్నాయి. మరోపక్క హాస్పిటల్స్ లో బెడ్స్ కూడా దొరుకుతున్నాయి కాబట్టి, జనంలో కూడా భయం తగ్గింది. ఎలాగూ వ్యాక్సినేషన్ ఊపందుకుంటోంది. పైగా వచ్చేవారం నుంచి తెలంగాణాలో పగలు లాక్ డౌన్ ఉండదు అని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రాత్రిపూట కర్ఫ్యూ మాత్రం కంటిన్యూ చేసినా.. జులై నుంచి అది కూడా తీసేసే అవకాశం ఉంది. అందుకే సినిమా వాళ్ళు మళ్ళీ […]

Written By: , Updated On : June 7, 2021 / 06:48 PM IST
Follow us on

కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతానికి రోజురోజుకూ కరోనా కేసులు తగ్గుతున్నాయి. మరోపక్క హాస్పిటల్స్ లో బెడ్స్ కూడా దొరుకుతున్నాయి కాబట్టి, జనంలో కూడా భయం తగ్గింది. ఎలాగూ వ్యాక్సినేషన్ ఊపందుకుంటోంది. పైగా వచ్చేవారం నుంచి తెలంగాణాలో పగలు లాక్ డౌన్ ఉండదు అని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ రాత్రిపూట కర్ఫ్యూ మాత్రం కంటిన్యూ చేసినా.. జులై నుంచి అది కూడా తీసేసే అవకాశం ఉంది. అందుకే సినిమా వాళ్ళు మళ్ళీ షూటింగ్ ల పై ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ సినిమాలు జులై ఫస్ట్ వీక్ నుండి షూట్ కి రెడీ అయ్యాయి. ఆల్ రెడీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాల కోసం భారీ సెట్స్ కూడా వేశారు.

ఈ సెట్స్ లోనే షూట్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇక ‘పుష్ప’, ‘అర్ ఆర్ ఆర్’ సినిమాలు కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. అలాగే ‘సర్కారు వారి పాట’ కూడా జులైలోనే మళ్ళీ ప్రారంభం కానుంది. అయితే, సినిమాల రిలీజ్ ల విషయంలో ఇంకా క్లారిటీ లేకపోయినా చివరి దశకు వచ్చిన ఈ భారీ సినిమాలను త్వరగా పూర్తి చేయడానికి మేకర్స్ స్పీడ్ పెంచనున్నారు.

ముందు షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెడితే.. ఆ సమయంలో రిలీజ్ లను ప్లాన్ చేసుకోవచ్చు అనేది బడా నిర్మాతలు ప్లాన్. అలాగే త్వరగా షూటింగ్ ను స్టార్ట్ చేస్తే.. సినీ కార్మికులకు కూడా పని దొరుకుతుంది.