ఐపీఎల్: చెలరేగిన చెన్నై.. కుప్పకూలిన రాజస్థాన్

ఐపీఎల్ లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ సత్తా చాటింది. రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట చెన్నై బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్ లో చెన్నై బ్యాట్స్ మెన్ సమష్టిగా రాణించారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోరు చేసింది. మధ్యలో చేతన్ సకారియా 3 వికెట్లతో చెలరేగడంతో చెన్నై జట్టుకు బ్రేక్ పడింది. అయితే ఎవరూ పెద్ద స్కోర్లు చేయకున్నా.. తలా వీలైనన్నీ […]

Written By: NARESH, Updated On : April 19, 2021 10:54 pm
Follow us on

ఐపీఎల్ లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ సత్తా చాటింది. రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట చెన్నై బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్ లో చెన్నై బ్యాట్స్ మెన్ సమష్టిగా రాణించారు.

నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోరు చేసింది. మధ్యలో చేతన్ సకారియా 3 వికెట్లతో చెలరేగడంతో చెన్నై జట్టుకు బ్రేక్ పడింది. అయితే ఎవరూ పెద్ద స్కోర్లు చేయకున్నా.. తలా వీలైనన్నీ పరుగులు చేయడంతో చెన్నై భారీ లక్ష్యాన్ని చేరుకుంది.

డుప్లిసెస్ 33, మెయిన్ అలీ 26, అంబటిరాయుడు 27, సురేష్ రైనా 18, ధోని 18, బ్రావో 20 ఇలా ప్రతి ఒక్కరూ రావడం.. దంచికొట్టడంతో స్కోరు బోర్డు పరిగెత్తింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఇక అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ బ్యాట్స్ మెన్ తడబడ్డారు. ఓపెనర్ జోస్ బట్లర్ 35 బంతుల్లో 49 పరుగులతో చెలరేగాడు. ఇక కెప్టెన్ సంజు శాంసన్ 1 పరుగకే ఔట్ అయ్యి నిరాశపరిచాడు. ఇక ఆ తర్వాత దూబే, డెవిడ్ మిల్లర్, పరాగ్, క్రిస్ మోరీస్ లు వరుసగా మోయిన్ అలీ బౌలింగ్ లో ఔట్ కావడంతో రాజస్థాన్ ఓడిపోయింది. ఓపెనర్లు బట్లర్, వోహ్రా మాత్రమే కాసింత మెరుపులు మెరిపించారు. ఆ తర్వాత అందరూ బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టడంతో రాజస్థాన్ ఓడిపోయింది.